రమాప్రభ శరత్ బాబు మధ్య ఇంత వ్యవహారం నడిచిందా… అన్ని కోట్ల ఆస్తి ఇచ్చాడా?
TeluguStop.com
సీనియర్ నటుడు శరత్ బాబు( Sarath Babu ) అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఈయన మరణ వార్త ఇండస్ట్రీకి తీరనిలోటు అని చెప్పాలి.ఇలా శరత్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
ఈయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇకపోతే ఈయన సినీ కెరియర్ పక్కన పెట్టే వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.
అనంతరం కొన్ని మనస్పర్ధలు కారణంగా తనతో విడాకులు తీసుకున్నారని అందరికీ తెలిసిందే. """/" /
అయితే శరత్ బాబు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రమాప్రభ ( Ramaprabha ) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రమాప్రభ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి భారీగా సంపాదించారు.
అయితే శరత్ బాబు మాత్రం ఆమె వయసులో తన కన్న పెద్దది అయినప్పటికీ కేవలం ఆస్తి కోసమే తనని పెళ్లి చేసుకొని తన ఆస్తి తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై స్పందించిన ఈయన పలు విషయాలను గతంలో వెల్లడించారు. """/" /
రమాప్రభ ఆస్తి నేను తీసుకున్నానని అందరూ నన్ను విమర్శిస్తున్నారు.
కానీ రమాప్రభకు నేను 60 కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చానని ఈ సందర్భంగా శరత్ బాబు తెలియజేశారు.
అప్పట్లో నా ఆస్తులు అమ్మి రమాప్రభకు ఒక ప్రాపర్టీ తన తమ్ముడి పేరు మీద ఒక ప్రాపర్టీ అలాగే వారిద్దరి పేరు మీద మరో ప్రాపర్టీ కొనుగోలు చేశానని శరత్ బాబు గతంలో తెలిపారు.
అప్పట్లో నా వయసు 22 ఏళ్ళు.రమాప్రభ నాకంటే వయసులో 7 ఏళ్ళు పెద్దది.
కాలేజీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాను.ప్రపంచం గురించి తెలియని వయసులో రమాప్రభ తనకు పరిచయం ఏర్పడిందని ఆ వయసులో ఎలాంటి అనుభవం లేకుండా నేను తప్పు చేశాను అంటూ శరత్ బాబు గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?