ఆ కలర్ స్టార్ హీరో ప్రభాస్ కు లక్కీ కలర్ అంటున్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి అందరికి తెలిసిందే.బాహుబలి సినిమాతో( Bahubali ) పాన్ ఇండియా స్టార్ గా మారి గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇటీవల కల్కి,సలార్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక తాజాగా విడుదలైన కల్కి సినిమా( Kalki ) 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దీంతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది.ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ అదే ఊపుతూ తదుపరి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

"""/" / ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

రాజాసాబ్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె, సలార్ 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తున్నారు ప్రభాస్.

ప్రస్తుతం రాజాసాబ్ సినిమాపై దృష్టి పెట్టగా ఇప్పటికే ఈ సినిమా 50% మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

వీలైనంత తొందరగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.

అదేమిటంటే తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్( Raja Saab ) గ్లింప్స్‌ విడుదలైన విషయం తెలిసిందే.

ఇందులో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. """/" / తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో ప్రభాస్ వేసుకున్న కోట్ కలర్ మెరూన్ కలర్.ఇది డార్లింగ్‌ కు చాలా బాగా సూట్ అయింది.

కాగా ఇదే కలర్‌ డ్రెస్‌లో ప్రభాస్ మరో రెండు సినిమాల్లో కనిపించాడు.అందులో ఇండస్ట్రీ హిట్ బాహుబలి ఒకటి.

ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్‌లో ప్రభాస్ మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు.

అదే విధంగా కల్కీ సినిమాలో చక్రాన్ని కింద పడకుండా ఆపే సీన్‌లో కూడా అదే మెరూన్ కలర్‌ డ్రెస్‌లో కనిపిస్తాడు.

వినడానికి విడ్డూరంగా ఉన్న సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు ఆ రెండు సినిమాలు అరివీర భయంకర హిట్లుగా నిలిచాయి.ఇప్పుడు రాజా సాబ్ కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

రీసెంట్‌గా రిలీజైన గ్లింప్స్‌లో ప్రభాస్‌ను ( Prabhas )మాత్రం మామలుగా చూపించలేదు.అసలు ప్రభాస్‌ను అలా చూస్తు ఉండిపోవచ్చు.

అంత అల్ట్రా స్టైలిష్‌గా ఉన్నాడు.మొన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు మారుతి మీద కాస్త డౌట్ ఉండేది.

కానీ ఈ ఒక్క గ్లింప్స్‌తో డౌట్ కాస్త పోయి అంచనాలు మరింత పెరిగిపోయాయి.

వైసీపీకి మరో షాక్ .. మాజీ ఎంపీ అరెస్ట్