రాజకీయాల కోసం రాలేదు..: నారా భువనేశ్వరి

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాజకీయాల కోసం రాలేదని, నిజం గెలవాలనే వచ్చానని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం నిర్బంధించింది చంద్రబాబును కాదన్న ఆమె రాష్ట్రాన్ని నిర్బంధించారని తెలిపారు.ఈ క్రమంలో పోరాటం తనది మాత్రమే కాదని ప్రజలందరిదని చెప్పారు.

మహిళలు అంతా తన బాధను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో తనతో పాటు ప్రజలంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

వైరల్ వీడియో: కారు ఓనర్ కు చుక్కలు చూపించిన కాకులు