Nagarjuna :రాజమౌళికి అన్ని రూ.కోట్ల అడ్వాన్స్ ఇచ్చిన నాగార్జున.. ఇప్పటికైనా చేయాలంటూ?

టాలీవుడ్ అక్కినేని హీరోల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అక్కినేని హీరోలు అయిన నాగచైతన్య,నాగార్జున,అఖిల్ ( Naga Chaitanya, Nagarjuna, Akhil )లకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది.

నాగార్జున, నాగచైతన్య ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.కానీ అఖిల్ విషయం దారుణం అని చెప్పవచ్చు.

అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ కెరియర్ లో చెప్పు తగ్గ సరైన హిట్ సినిమా ఒకటి కూడా లేదు.

తాజాగా వచ్చిన ఏజెంట్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది.అఖిల్ కెరియర్ లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.

"""/" / ఈ సినిమాతో అఖిల్ కెరియర్ మారిపోతుందని అందరూ అనుకున్నప్పటికీ ఊహించని విధంగా సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచి అఖిల్ కెరియర్ అయోమయంలో పడింది.

కెరియర్ మొదట్లో భారీ హైప్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంతో స్టార్ హీరో రేంజ్ కి ఎదుగుతాడని అందరూ భావించారు.

కానీ ఊహించని విధంగా అఖిల్ కెరియర్ పాతాళంలోకి వెళ్లిపోయింది.అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అఖిల్ నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా సరైన హిట్ సినిమా పడాల్సిందే.

లేదంటే అఖిల్ కెరియర్ కు పులిస్టాప్ పడ్డట్టే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

"""/" / అయితే ఇప్పటివరకు నాగార్జున కొడుకు ఇష్టాన్ని కాదని లేక కొడుకు జీవితాన్ని తనకే వదిలేశాడు.

ఇప్పుడు కొడుకు జీవితం ప్రమాదంలోకి పడబోతోంది.దాంతో నాగార్జున రంగంలోకి దిగి కొడుకు ఫీచర్ ని చెక్కదిద్దె ప్రయత్నంలో ఉన్నారు.

ఇక అఖిల్ జీవితాన్ని బాగు చేయడం కోసం ఇటీవల నాగార్జున డైరెక్టర్ రాజమౌళిని( Rajamouli ) కలిసినట్లు తెలుస్తోంది.

అఖిల్ తో సినిమా చేయాలని నాగార్జున రాజమౌళిని కోరాడట.ఈ మేరకు నాగార్జున రాజమౌళి కి 10 కోట్లు అడ్వాన్స్ గా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో( Mahesh Babu ) చేయబోతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులలో బిజీ బిజీగా ఉన్నారు.

రాజమౌళి మహేష్ బాబు సినిమా పూర్తి అయిన వెంటనే అఖిల్ తో సినిమా చేయబోతున్నట్లు రాబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే తప్పకుండా అఖిల్ కెరీర్ సెట్ అవుతుందని, పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మా కన్నా కూడా బాగా నటించారని ఒప్పుకున్న టాప్ సెలబ్రిటీస్… కారణం ఏంటి ?