నాగార్జున తన కొడుకుల విషయం లో జోక్యం చేసుకోడా..? ప్రస్తుతం అఖిల్ పరిస్థితి ఏంటి..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి(Akkineni Family) చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు చాలామంది హీరోలు వచ్చినప్పటికి వారిలో కొంతమంది నటులు మాత్రమే సక్సెస్ ఫుల్ హీరోలుగా మంచి ఇమేజ్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నారు.
నాగార్జున కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ (naga Chaitanya, Akhil)ఇద్దరు ఇండస్ట్రీకి ఏంటి ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి స్టార్ హీరో రేంజ్ కి మాత్రం వెళ్ళలేకపోతున్నారు.
కారణం ఏదైనా కూడా తోటి హీరోలతో పోల్చుకుంటే వాళ్ళు చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి.
నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో అక్కినేని వారు మాత్రమే వెనుకబడి పోవడానికి గల కారణం ఏంటి అనే విధంగా నాగార్జున మరోసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మీ సినిమాల విషయంలో నాగార్జున జోక్యం ఏమైనా ఉంటుందా అని నాగచైతన్యని అడిగగా ఆయన దానికి రెస్పాండ్ అవుతూ నేను చేసే సినిమాల విషయంలో మా నాన్న అసలు జోక్యం చేసుకోడు.
ఒకవేళ మేము ఎవరైనా డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉంది అని చెబితే ఆ వెంటనే ఆయన ఆ కాంబినేషన్ ను సెట్ చేయగలడు.
కానీ మేము అలాంటి పని చేయకుండా మము మేము ఇండివిజ్యువల్ గా ఎదగాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాము అంటూ కొన్ని మాటలైతే చెప్పాడు.
ఇక దాంతో నాగార్జున(Nagarjuna) తన కొడుకుల విషయంలో జోక్యం చేసుకోడనే వాదనలైతే వినిపిస్తున్నాయి.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలుగా వస్తున్నప్పటికి ఇప్పటివరకు సరైన సక్సెస్ ని సాధించలేదు అంటే ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక మీదటైన మంచి సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
బాలీవుడ్ హీరోలకంటే తెలుగు హీరోలే ముద్దు అంటున్న సందీప్ రెడ్డి వంగ…