జనసేన లో చేరకముందే ‘మొగలిరేకులు’ సాగర్ కి ఇంత పెద్ద పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా!
TeluguStop.com
మొగలిరేకులు( Mogilirekulu ) అనే సీరియల్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానం ని చూరగొన్న నటుడు ఆర్కే సాగర్( RK Sagar ).
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో సాగర్ కి ఈ సీరియల్ ద్వారా అద్భుతమైన క్రేజ్ వచ్చింది.
ఆర్కే నాయుడు మరియు మున్నా భాయ్ పాత్రలలో సాగర్ నటించిన తీరు అద్భుతం.
ఇప్పటికీ ఈ సీరియల్ ని యూట్యూబ్ లో చూస్తూనే ఉంటారు ఆడియన్స్.అంత మంచి క్రేజ్ వచ్చింది ఆయనకీ.
ఈ క్రేజ్ తో ఆయనకీ పలు సినిమాల్లో హీరో గా నటించే ఛాన్స్ కూడా వచ్చింది.
కానీ సరైన స్క్రిప్ట్ ఎంచుకోకపోవడం తో ఇప్పటి వరకు సాగర్ కి హీరో గా హిట్టు లేదు.
మొగలి రేకులు సాగర్ అంటే మన అందరికీ కేవలం ఒక సీరియల్ ఆర్టిస్టు గా మాత్రమే సుపరిచితం, కానీ ఇతనికి పెద్ద పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది అనే విషయం ఈమధ్యనే తెలిసింది.
"""/" /
జనసేన పార్టీ( Janasena Party ) లోకి చేరిన తర్వాత ఈరోజు ఆయన మొట్టమొదటి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు.
ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తో తనకి ఉన్న అనుబంధం గురించి, జనసేన పార్టీ లో చేరడానికి గల కారణం గురించి చెప్పుకొస్తూ, తన బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.
నేను కేవలం ఒక సీరియల్ హీరో గా మాత్రమే అందరికీ తెలుసు, కానీ మా తాతయ్య గారు నాన్న గారు కమ్యూనిస్ట్ పార్టీ( Communist Party ) ద్వారా ఎన్నో పోరాటాలు చేసారు.
నాకు కూడా తెలంగాణ లో ఉన్న సమస్యలపై ఎంతో అవగాహన ఉంది.నా భావజాలం మరియు పవన్ కళ్యాణ్ గారి భావజాలం కలవడం వల్లే నేను జనసేన పార్టీ లో చేరాను అంటూ చెప్పుకొచ్చాడు సాగర్.
పార్టీలోకి చేరేముందు పవన్ కళ్యాణ్ తో ఆయన సుమారుగా ఆరు నెలల నుండి టచ్ లో ఉన్నాడట.
"""/" /
అలా సుదీర్ఘ చర్చలు పవన్ కళ్యాణ్ గారితో జరిపిన తర్వాతే జనసేన లో చేరానని, నిన్న మొన్న అనుకొని ఏమి చేరలేదు అంటూ చెప్పుకొచ్చాడు సాగర్.
జనసేన పార్టీ తెలంగాణ లో కొత్త పార్టీ అని, ఇప్పుడిప్పుడే బేస్ ఏర్పడింది, పార్టీ బలోపేతం కి తనవంతు సహకారం గా ఎన్ని అయితే చేయగలనో అన్నీ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
సాగర్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
రీసెంట్ గానే సాగర్ ని జనసేన పార్టీ తరుపున తెలంగాణాలో ప్రచారకర్త గా నియమించాడు పవన్ కళ్యాణ్.
కెనడా – బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు.. అమెరికాలో ప్రవాస భారతీయుల ర్యాలీ