Niharika: నిహారికను మెగా ఫ్యామిలీ కూడా పక్కకు పెట్టేసారా.. అందుకే ఇలా తెగిస్తుందా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి( Mega Family ) ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హీరోలుగా ప్రతి ఒక్కరూ మంచి సక్సెస్ అందుకున్నారు.అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా తమకంటూ ఒక గౌరవాన్ని సంపాదించుకున్నారు.
కానీ తమ ఆడపడుచులవల్ల పరువు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.గతంలో చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ ఇంటి నుంచి పారిపోయి వేరే పెళ్లి చేసుకొని పరువు మొత్తం తీయగా మళ్లీ అతనికి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంది.
రెండో భర్త కూడా విడాకులు ఇచ్చేసి దూరంగా బతుకుతుంది.గతంలో పెద్దకూతురు కూడా ఉదయ్ కిరణ్ విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారింది.
అలా చిరంజీవి తన ఇద్దరు కూతుర్ల పట్ల చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయని చెప్పాలి.
అయితే నాగబాబు( Nagababu ) కూతురు నిహారిక ( Niharika ) కూడా అలాగే తయారవుతుంది.
హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె హీరోయిన్ గా అంత సక్సెస్ కాలేకపోయింది.కేవలం మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో మాత్రమే ఈమెకు ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలైన వచ్చాయి.
"""/" /
నిజానికి ఈమెలో టాలెంట్ లేదని చెప్పొచ్చు.ఇక నటిగా సక్సెస్ కాలేకపోయేసరికి నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
నిర్మాతగా కూడా అంతంత మాత్రమే అన్నట్లు ఉంది.గతంలో ఇద్దరు హీరోలతో ప్రేమ వ్యవహారం నడిపింది అని టాక్ నడిచింది.
ఆ తర్వాత తన తండ్రి చూపించిన సంబంధాన్ని చేసుకుంది.అలా ఆమె జొన్నలగడ్డ చైతన్యను కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత చాలా మారిపోయింది.కొత్త అవతారంతో దర్శనమిచ్చింది.
పైగా భర్త సపోర్టు ఎక్కువగా ఉండటంతో బాగా బరితెగించేసింది.అంతేకాకుండా అత్తారింట్లో పరువు కూడా తీసేసింది.
గతంలో ఓ పబ్ కేసులో, జిమ్ ట్రైనర్ తో క్లోజ్ గా ఉన్న విషయంలో అత్తింటి పరువును గంగలో కలిపేసింది.
అయిన కూడా ఆ సమయంలో తన భర్త తనను ఏమీ అనకుండా తనకు సపోర్టుగా నిలిచాడు.
"""/" /
దీంతో నిహారిక మరింత నెత్తికెక్కి కూర్చున్నట్టు తెలిసింది.అలా ప్రవర్తనలో కూడా కాస్త మార్పు రావటంతో గతంలో వీరి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత కొద్దిరోజులకే అవి సద్దుమణిగాయని తెలిసింది.కానీ మళ్ళీ వీరి మధ్య ఏవో గొడవలు జరిగాయని దాంతో ఇద్దరు కలిసి ఉండటం కరెక్ట్ కాదు అనుకొని దూరంగా ఉంటున్నట్టు తెలిసింది.
"""/" /
అదే సమయంలో తమ పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేయడం, ఒకరికొకరు అన్ ఫాలో కావడంతో వారిద్దరి విడాకులు తీసుకున్నారని క్లియర్ గా అర్థమైంది.
ఇక అలా అత్తింటి వారు ఆమెను దూరం పెట్టడంతో.తన తల్లిదండ్రులు కూడా ఆమెను మునుపటిలా చూసుకోవడం లేదు అని తెలిసింది.
ఇక తల్లిదండ్రులు కూడా అలా చేయటంతో కొణిదెల ఫ్యామిలీ మొత్తం ఆమెను దూరం పెట్టేసినట్టు తెలుస్తుంది.
దీంతో అందర్నీ వదిలేసి సోషల్ మీడియాలో కూడా పొట్టి పొట్టి బట్టలు వేస్తున్న ఫోటోలను పంపిస్తూ బాగా బరితెగిస్తుందని.
అలా సోషల్ మీడియాలో ఈమెను కొణిదెల ఫ్యామిలీ దూరం పెట్టేసారు అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మేం చాలా రిచ్, శ్రీమంతులం.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?