లోకేష్ పాదయాత్ర లక్ష్యం సాధించిందా?

తెలుగుదేశం పార్టీని అధికారం లోకి తీసుకురావడమే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం జాతీయ కార్యదర్శి మరియు చంద్రబాబు తనయుడు నారా లోకేష్( Nara Lokesh ) తన పాదయాత్రను ముగించారు.

226 రోజులు పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ పాదయాత్ర 3132 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది .

విశాఖపట్నంలో ఆయన పాదయాత్రకు ముగింపు పలికారు.అయితే ఏ లక్ష్యాలతో అయితే లోకేష్ యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) మొదలయ్యిందో ఆ లక్ష్యాలను లోకేష్ చేరుకున్నారా? అన్నదానిపై ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

అయితే యాత్ర ప్రారంభానికి యాత్ర ముగింపుకు మధ్య ఒక నాయకుడిగా లోకేష్ లో చాలా పరిణితి పెరిగిందని, కార్యకర్తలతోనూ స్థానిక నాయకులతోనూ ఆయన సమన్వయం చేసుకున్న పద్ధతి ఆయన ఆయనలో సరికొత్త నాయకుడిని చూపించిందన్నది తెలుగుదేశం కార్యకర్తల వాదన.

అంతేకాకుండా ఆయా నియోజకవర్గాలలో అధికార పక్షంపై ధైర్యంగా విరుచుకు పడడం లోనూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెన్ను చూపకుండా నిలబడటం లోనూ లోకేష్ పరిణితి చూపించాడని """/" / ఈ యాత్ర ఖచ్చితంగా ఆయన ఆత్మ విశ్వాసాన్ని కొన్ని రేట్లు పెంచిందన్నది పార్టీ శ్రేణుల విశ్లేషణ.

అయితే చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) వంటి కీలక పరిణామాలతో కొంతకాలం పాటు వాయిదా పడిన తర్వాత మాత్రం యువగళం పాదయాత్ర తన ఉనికిని కోల్పోయి మొక్కుబడి వ్యవహారం లా మారిపోయిన వాతావరణం కనిపించింది.

అయితే ఎట్టకేలకు యువగళం పాదయాత్రను పూర్తిచేసుకున్న లోకేషన్ ఇక పూర్తిస్థాయి ఎన్నికల మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.

"""/" / ఇప్పటికే సీట్ల కేటాయింపు పై అంతర్గత చర్చలు పూర్తయిన దరిమిలా ఇక సీట్ల కేటాయింపు చేసి ఎన్నికల ప్రచారాన్ని( Elections Campaign ) శరవేగం గా మొదలుపెట్టాలని తెలుగుదేశం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు సుదీర్ఘ పాదయాత్రలు చేస్తున్న ప్రతి పార్టీ రాజకీయంగా విజయం సాధించింది.

మరి లోకేష్ చేసిన ఈ సుదీర్ఘ పాదయాత్ర కూడా తెలుగుదేశం పారి విజయ తీరాలకు చేరుస్తుంది అని తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే నమ్ముతున్నట్టు కనిపిస్తుంది.

How Modern Technology Shapes The IGaming Experience