ష‌ర్మిల‌ను కేసీఆర్ త‌క్కువ అంచ‌నా వేశారా…. సీన్ రివ‌ర్స్ ?

ష‌ర్మిల‌ను కేసీఆర్ త‌క్కువ అంచ‌నా వేశారా…. సీన్ రివ‌ర్స్ ?

రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.తెలంగాణలో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రెడీ అయిన ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.

ష‌ర్మిల‌ను కేసీఆర్ త‌క్కువ అంచ‌నా వేశారా…. సీన్ రివ‌ర్స్ ?

ష‌ర్మిల దూకుడు టీఆర్ ఎస్ అదినేత‌, సీఎం కేసీఆర్ అనుకున్న‌ట్టుగా లేద‌నే వాద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ష‌ర్మిల‌ను కేసీఆర్ త‌క్కువ అంచ‌నా వేశారా…. సీన్ రివ‌ర్స్ ?

ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌నకు ముందు.త‌ర్వాత కూడా కేసీఆర్ పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.

తెలంగాణ‌లో ఎవ‌రు పార్టీ పెట్టినా.స‌క్సెస్ కావ‌డం క‌ష్ట‌మ‌ని.

ఇప్ప‌టికే విజ‌య‌శాంతి, ఆలి న‌రేంద్ర వంటి అనేక మంది విఫ‌ల‌మ‌య్యార‌ని.ఈ క్ర‌మంలో ష‌ర్మిల కూడా విఫ‌ల‌మ‌వుతార‌ని.

ఇది ఉత్తిత్తి ఊపుడేన‌ని కేసీఆర్ సూత్రీక‌రించారు.ఇక‌, టీఆర్ ఎస్ నాయ‌కులు కూడా ఇదే అనుకున్నారు.

ఇదే విష‌యాన్ని టీఆర్ ఎస్ కీల‌క నాయ‌కులు కూడా చెప్పుకొచ్చారు.దీంతో అంద‌రూ నిజ‌మేన‌ని అనుకు న్నారు.

ఏపీకి చెందిన ష‌ర్మిల‌.ఎంత‌గా తాను తెలంగాణ కోడ‌లిన‌ని ప్ర‌క‌టించుకున్నా.

పెద్ద‌గా రియాక్ష‌న్ ఉండ‌ద‌ని అనుకున్నారు.కానీ, అనూహ్యంగా ష‌ర్మిల దూకుడు మ‌రోలా ఉంది.

అంద‌రి అంచ‌నాలకు భిన్నంగా ఆమె అడుగులు వేస్తున్నారు.అన్ని పార్టీల నేత‌ల‌తోపాటు.

సెల‌బ్రిటీల‌ను కూడా ఆమె త‌న పార్టీ వైపు ఆక‌ర్షిస్తున్నారు.ఇంకా పార్టీ పేరును ప్ర‌క‌టించ‌కుండానే.

విధివిధానాలు.ఒక పిక్చ‌ర్‌ను రెడీ చేయ‌కుండానే ఆమెవైపు వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.

షర్మిల పార్టీ ప్రకటనకు ముందే వైఎస్ ఫ్యాన్స్‌తో నిండిపోతోంది.ఇతర పార్టీల నుంచి షర్మిల పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.

దీంతో లోటస్ పాండ్.ఫ్యాన్స్ పాండ్‌గా మారింది.

షర్మిలను సామాన్యులు మాత్రమే కాదు.సెలబ్రెటీలు సైతం కలుస్తున్నారు.

పార్టీలో పూర్తికాల కార్యకర్తలుగా పనిచేస్తామని హామీ ఇస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ యాంకర్ శ్యామలా రెడ్డి మద్దతు తెలిపారు.

ఇప్పుడు తాజాగా నటి ప్రియ షర్మిలతో కలిసి నడుస్తామని ప్రకటించారు. """/"/ ఈ సందర్భంగా నటి ప్రియా మీడియతో మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డికి పెద్ద అభిమానినని చెప్పారు.

వైఎస్‌ను ఎప్పుడైనా కలవాలని ఉండేదని, కానీ కలవలేకపోయానని అన్నారు.ఇప్పుడు షర్మిల పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

తనకు రాజకీయం పట్ల పెద్దగా అవగాహన లేదని, వైఎస్‌ చేసిన కార్యక్రమాలు చూసి.

తాను కూడా ప్రజలకు సేవ చేయాలని అనుకున్నానని చెప్పారు.మరోవైపు కాంగ్రెస్ నుంచి షర్మిల పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.

వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కల్పనా రెడ్డి షర్మిల పెట్టబోయే పార్టీకి మద్దతు తెలిపారు.

 మొత్తంగా చూస్తే.కేసీఆర్ స‌హా కీల‌క నాయ‌కులు అనుకున్న దానికి భిన్నంగానే ష‌ర్మిల దూకుడు ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.