ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అమిత్ షా పాత్ర ఉందా?

2015లో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు స్కాం గురించి అందరికి తెలిసిందే.

ఈ స్కాంలో చంద్రబాబు నాయుడు చేసిన జరిపిన పలు అడియో సంభాషణలు కూడా బయటకు రావడంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పన్నిన ఉచ్చులో రెవంత్ రెడ్డి, చంద్రబాబు సులువుగా చిక్కుకున్నారు.

నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌తో నాయుడు జరిపిన టెలిఫోనిక్ సంభాషణ పలు ఛానల్స్ పదే పదే ప్రసారం చేశాయి.

దీంతో తెలంగాణలో టీడీపీ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసింది.రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌కు రూ.

50 లక్షల నగదు అందజేయడం వీడియోలో స్పష్టంగా రికార్డు అయింది.అవినీతి నిరోధక శాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా సృష్టించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇక తాజా ఎపిసోడ్‌లో రెండు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో నలుగురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన వ్యవహారం కూడా అదే తరహాలో చేసినట్లు కనిపిస్తోంది.

కేసీఆర్ సూచనల మేరకు సైబరాబాద్ పోలీసులు మధ్యవర్తులను పట్టుకోవడం కోసం ఉచ్చు పన్నారు.

రహస్య కెమెరాలు, ఆడియో రికార్డింగ్ మెటీరియల్‌లతో మధ్యవర్తులను పట్టుకున్నారు.వారి టెలిఫోన్‌లను కూడా ట్యాప్ చేశారు, ముగ్గురు మధ్యవర్తులతో ముందుగా నలుగురి ఎమ్మెల్యేలలో ఒకరైన పైలట్ రోహిత్ రెడ్డి ఎర వేశారు.

తర్వాత ఫామ్‌హౌస్‌కు నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించి భేరసరాలు ఆడారు. """/"/ కొన్ని గంటల్లో సాగిన రికార్డులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

అయితే ఈ స్కాం వెనుకలా బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లుగా తెరాస ఆరోపిస్తుంది.బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్‌కు నిఘా వర్గాలు తగిన సాక్ష్యాలను అందించాయని వర్గాలు చెబుతున్నాయి.

ఓ సంభాషణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గొంతు కూడా ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుండి సమాచారం.

ప్రస్తుతం ఆ వాయిస్ నమూనాను అర్థంచేసుకోవడానికి పోలీసులు ల్యాచ్ పంపించినట్లు తెలుస్తుంది.

జగన్ మద్దతు ఇవ్వకపోతే… బీజేపీ టార్గెట్ వారే ?