కేసీఆర్ వ్యతిరేకులకు ఈటెల రూపంలో మరో అస్త్రం దొరికినట్టయిందా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఎటువంటి గందరగోళం లేకుండా కొనసాగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్నవి కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గం.

మొదటి దఫా ప్రభుత్వంలో ఇంతలా లేకున్నా రెండో దఫా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ వ్యతిరేక వర్గం అనేది ఒకటి ఏర్పడింది.

ఎందుకంటే ఏ పార్టీ అయినా రెండో దఫా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే చాలా కష్టం.

కాని కేసీఆర్ అలవోకగా రెండో దఫాలో కూడా ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు.

అయితే ఇక మూడో దఫా ప్రభుత్వం కూడా ఏర్పడితే కేసీఆర్ ను అడ్డుకోవడం ఇక చాలా కష్టం అని గ్రహించిన కేసీఆర్ వ్యతిరేక వర్గం కేసీఆర్ ను సమయం దొరికితే ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పరిస్థితి నెలకొంది.

అయితే ఇప్పటి వరకు రకరకాలుగా కేసీఆర్ ను విమర్శించి, ఇక గత కొద్దీ కాలంగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ వ్యతిరేక వర్గానికి ఈటెల రూపంలో మంచి అస్త్రం దొరికినట్టయింది.

ఇక ఈటెల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తూ కేసీఆర్ పై విరుచుకపడుతున్న పరిస్థితి నెలకొంది.

మరి కేసీఆర్ ఈటెల వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాల్సి ఉంది.ఒకవేళ ఈటెల మీద ఉన్న ఆరోపణలు నిజమైతే ఎవరైతే ఇప్పుడు ఈటెల వెంట ఉన్నారో వారు ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.

మెడ మొత్తం నల్లగా అసహ్యంగా మారిందా.. ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా..!