కేసీఆర్ ఆ పూజలు చేశారా ? పేరు మార్చమని వారు చెప్పారా ? 

ఒక రాష్ట్ర పార్టీకి అధినేతగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అయ్యారు.

టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి సంచలనం సృష్టించారు.దేశవ్యాప్తంగా కేసీఆర్ జాతీయ పార్టీపై అందరికీ ఆసక్తి మొదలైంది.

అయితే జాతీయ స్థాయిలో కేసీఆర్ వెంట నడిచేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించకపోయినా,  ఆయన ఇంత అకస్మాత్తుగా  ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది అందరికీ అంతుపట్టని విధంగానే ఉంది.

అయితే ఇతర రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకుండా,  ఎన్నికల్లో ఎలా పోటీ చేసి గెలుస్తారనేది అందరికీ పెద్ద మిస్టరీ గానే ఉంది.

ఇది ఇలా ఉంటే కెసిఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, టిఆర్ఎస్ ను దాంట్లో విలీనం చేయడం పైన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

 కేసిఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని ఈ మేరకు తనకు సమాచారం ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

తాంత్రికుడు చెప్పడం వల్ల కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని,  ప్రస్తుతం ఉన్న టిఆర్ఎస్ అన్న పేరుకు  కాలం చెల్లిందని, ఆ పేరుతో వెళితే పార్టీ గెలవదని ఆ తాంత్రికుడు చెప్పాడని,  అందుకే తాంత్రికుడి సూచనతో టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిఆర్ఎస్ కు జెండా లేదు ,అజెండా లేదు దేశాన్ని ఉద్ధరించడానికి టిఆర్ఎస్ పెట్టలేదని,  కేవలం దయ్యాలు , రాక్షస పూజలు చేస్తున్నాడు కాబట్టి వారి మాటలు విని పార్టీ పేరు మార్చారని సంజయ్ కామెంట్ చేశారు.

  """/" / ఆ తాంత్రికులు చెప్పడం వల్లే ఆయన సచివాలయానికి వెళ్లడం లేదని సంజయ్ వ్యాఖ్యానించారు.

నల్ల పిల్లితో ఫామ్ హౌస్ లో కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తాడని , అయితే ఆయన క్షుద్ర పూజలు ఫలించకుండా పోయే పరిస్థితి ఇప్పటికే వచ్చిందని సంజయ్ అన్నారు.

దుబ్బాక హుజురాబాద్ లలో కెసిఆర్ తాంత్రిక పూజలు ఫలించలేదని ఎద్దేవా చేశారు.సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యింది.

 .

కస్టడీలో ఉన్నా మేకప్.. పవిత్ర గౌడ బిహేవియర్ ను నెటిజన్లు ఛీ కొడుతున్నారుగా!