కాజల్ అగర్వాల్ లిప్ సర్జరీ చేయించుకుందా? అందుకే అలా కనిపిస్తుందా?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగటానికి తమ అందాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు.
ముఖ్యంగా హీరోయిన్స్ మాత్రం అందం విషయంలో ఏమాత్రం తగ్గరు.తమ ఫేస్ కి ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే సర్జరీ చేయించుకుంటారు.
లావుగా ఉంటే సన్నగా మారటానికి కూడా బాగా ప్రయత్నాలు చేస్తారు.ఇక ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకున్నారు.
అందులో కాజల్ అగర్వాల్ కూడా ఒకరని తెలుస్తుంది.తను లిప్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ గురించి అందరికీ పరిచయమే.
ఈ భామ అతి తక్కువ సమయం లోనే తెలుగు నాట ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.టాలీవుడ్ లో నిత్యం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంటూ ఓ వెలుగు వెలుగుతుంది.
తొలిసారిగా లక్ష్మి కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్.ఆ తరువాత మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటించింది.
ఇక ఈమెకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.
ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ.తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది.
చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి.
అతడిని పెళ్లి చేసుకుంది.అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.
ఇక ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.
ఇక ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఇక బిడ్డ పుట్టాక కూడా కాజల్ ఎనర్జీ మాత్రం తగ్గలేదు.
ఎప్పటిలాగే వర్కౌట్లు చేయడం మొదలుపెట్టింది. """/"/
రెండు మూడు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండదు.
ఇదిలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ ఒక ఫోటో షేర్ చేసుకోవడంతో ఆ ఫోటో బాగా వైరల్ అయింది.
అయితే అందులో తను అందంగా కనిపించినప్పటికీ కూడా తన ఫేస్ లో ఏదో తేడాగా అనిపించింది.
దీంతో ఆ ఫోటోని చూసి నెటిజన్స్ కాజల్ పెదవులను గమనిస్తే ఏదో తేడా కొడుతుంది అంటూ.
బహుశా కాజల్ కూడా పెదవులకు సర్జరీ చేయించుకుందా.అందుకే ఆమె ముఖం అలా కనిపిస్తుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గతంలో కాజల్ తన అందం కోసం సర్జరీ చేయించుకుంది అని ఇండస్ట్రీలో బాగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
యూకేలో 80 ఏళ్ల భారత సంతతి వృద్ధుడి హత్య.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలిక