జ‌గ‌న్ కామెంట్లు టీడీపీకి ప్ర‌శ్నించే ఛాన్స్ ఇచ్చాయా..?

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంద‌ర్భోచితంగా మాట్లాడే నాయ‌కుడు.అవ‌స‌ర‌మైతే త‌ప్ప మీడియా ముందుకు రారు.

గంట‌లు గంట‌లు మీడియాతో చిట్ చాట్ నిర్వ‌హించ‌రు.కేవ‌లం త‌ను చెప్పద‌ల్చుకున్న‌ది ఏంటో ముందే అనుకొని వ‌చ్చి మీడియా ముందు చెప్పేస్తారు.

ఆ స‌మావేశంలో కూడా ఎప్పుడూ యాంగ్రీ అయిన‌ట్టు క‌నిపించ‌రు.కేవ‌లం అసెంబ్లీ స‌మావేశాల్లో మాత్రమే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై మాత్ర‌మే కొంత విరుచుకుప‌డిన‌ట్లు క‌నిపిస్తారు.

అయితే ఇటీవ‌ల ఏపీలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో తొలి సారిగా స‌మావేశంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ కొంత యాంగ్రీనెస్‌గా క‌నిపించారు.

ఫ‌స్ట్ టైం స్టేజీపై అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలం ఉప‌యోగించి, దాని అర్థం విడ‌మ‌ర్చి చెప్పారు.

సాక్షాత్తూ ఒక ముఖ్య‌మంత్రిని అలాంటి ప‌ద‌జాలంతో దూషించ‌వ‌చ్చా ? అని ప్ర‌శ్నించారు.ఒక గౌర‌వ‌మైన ప‌దవిలో ఉన్న వ్య‌క్తిని ఎవ‌రంటే వారు, ఎలా ప‌డితే అలా దుర్భాషాల‌డ‌వ‌చ్చా అని ఆవేద‌న వ్యక్తం చేశారు.

అయితే ఈ మాట‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి.తాను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు, అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై కోపంలో ఉన్న మాట‌లు గుర్తు చేసుకుంటున్నారు.

ఒక సంద‌ర్భంలో కాల్చి చంపండి, ఉరి తీయండి అంటూ ఘాటు పదాలు ఉప‌యోగించార‌ని తెలియ‌జేస్తున్నారు.

"""/"/ అప్పుడు మీరు మాట్లాడ‌గా లేనిది ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న నాయ‌కులు మాట్లాడితే త‌ప్పేంటి అనే వాద‌న వినిపిస్తోంది.

ఇవే వ్యాఖ్య‌లు ఇప్పుడు సెల్ఫ్ డిపెన్స్‌లో ప‌డేశాయి అని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తాను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉంటే ఒక‌లా మాట్లాడ‌వ‌చ్చ‌ని, ఇత‌రులు అలా మాట్లాడకూడ‌ద‌ని చెప్పుతున్న‌ట్టుగా ఆయ‌న మాటలు ఉన్న‌య‌ని అంటున్నారు.

త‌మ‌కో న్యాయం, ఇత‌రుల‌కు ఒక న్యాయ‌మా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.ఏది ఏమైనప్ప‌టికీ ఏపీ రాజ‌కీయాలు ఈ అస‌భ్య ప‌దజాలాల చుట్టే తిర‌గ‌డం అంత మంచి ప‌రిణామం కాదు.

శంకరాభరణం మూవీ నిర్మాత ఎంతటి గొప్ప క్లాసిక్ సినిమాలు తీశారో తెలుసా..??