ఆ ప్రకటనతో డీకే అరుణ ఇలా డిసైడ్ అయ్యారా ? 

తెలంగాణ బిజెపిలో పరిస్థితులు ఎవరికి  అర్థం కావడం లేదు.కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీ నుంచి కీలక నేతలు చాలామంది కాంగ్రెస్( Congress ) లో చేరుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

సీనియర్ నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.  ఇదే విధంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ్( DK Arun ) కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా,  కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

  నిన్ననే బిజెపి రెండో జాబితాను విడుదల చేసింది.ఆ జాబితాలో కేవలం ఒకే ఒక సీటును ప్రకటించింది.

అదే డీకే అరుణకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది .మొదటి నుంచి మహబూబ్ నగర్ ( Mahbub Nagar )సీటు కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతున్నారు.

  అదే సీటు కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.

  తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునే విషయంలో ఆయన ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.

"""/" / జితేందర్ రెడ్డి( Jitender Reddy ) కుమారుడు మిథున్ రెడ్డికి ఆ సీటును బిజెపి కేటాయించింది .

కేవలం ఒకే ఒక పేరుతో అప్పటికప్పుడు ఈ ప్రకటన చేయడానికి కారణాలు ఉన్నాయి .

తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతారనే అనుమానంతో బిజెపి ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కేటాయింపు పై డీకే అరుణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.ఇప్పటికే కాంగ్రెస్ నేతలు డీకే అరుణ సంప్రదింపులు చేస్తున్నారు.

ఇదే సమయంలో తాను కోరిన స్థానాన్ని బిజెపి ఇవ్వకుండా జితేందర్ రెడ్డి కుమారుడికి ఇవ్వడాన్ని  సీరియస్ గా.

తీసుకున్నారు. """/" / తాను ఆ స్థానాన్ని కోరుతున్నా జితేందర్ రెడ్డి కుమారుడికి కేటాయించడంతో తనను బిజెపి( BJP ) పక్కన పెట్టిందని అరుణ అసంతృప్తితో రగిలిపోతున్నారట.

ఈ క్రమంలోని పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇటీవల కాలంలో బిజెపి నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి.

ఈటెల రాజేందర్ తో పాటు బిజెపిలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ వంటి వారు బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు .

ఇదే బాటలో అరుణ కూడా ఉన్నట్టు సమాచారం.

రూ.కోటి విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచిన చరణ్.. మెగా ఫ్యామిలీ మొత్తం విరాళం ఎంతంటే?