Nayanathara: డైరెక్టర్ అట్లీ ఆ హీరోయిన్ తో చేతులు కలిపి నయనతారని అంతలా అవమానించారా..?

సెప్టెంబర్ 7న పాన్ ఇండియా మూవీ గా విడుదలైన షారుక్ ఖాన్ ( Sharukh Khan ) జవాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లకు చేరువలో ఉంది.పాన్ ఇండియా సినిమాగా వచ్చిన జవాన్ ( Jawan ) సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అలాగే హీరోయిన్ గా నయనతార చేసింది.

ఇక ఇందులో గెస్ట్ రోల్స్ ప్రియమణి, దీపికా పదుకొనేలు చేశారు.అయితే ఈ సినిమా గురించి తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.

డైరెక్టర్ అట్లీ ఆ హీరోయిన్ తో చేతులు కలిపి నయనతారని అవమానించారు అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.జవాన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ నయనతార ( Nayanathara ) అయినప్పటికీ దీపికా పదుకొనేని సినిమాలో హైలెట్ చేసి చూపించారు డైరెక్టర్ అట్లీ.

ఇక మామూలుగానే ప్రమోషన్స్ లో పాల్గొని నయనతార జవాన్ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు.

ఇక మూవీ ప్రమోషన్స్ లో షారుఖ్ ఖాన్ తో దీపిక పదుకొనే పాల్గొని హడావిడి చేసింది.

"""/" / అలాగే ఈ సినిమా ఓకే చేసే ముందే నయనతార కి అట్లీ ( Atlee ) ఈ సినిమాలో నువ్వే మెయిన్ హీరోయిన్ దీపిక కేవలం గెస్ట్ రోల్ మాత్రమే అని చెప్పారట.

కానీ తీరా సినిమా చూస్తే నయనతార కంటే ఎక్కువగా దీపికా పడుకొనే నే అట్లీ హైలెట్ చేసి చూపించారు.

ఇక దీపికా పదుకొనే సీన్స్ కొన్ని ఎడిట్ చేసి మరీ ఎక్కువగా హైలెట్ చేయడంతో నయనతార అట్లీపై చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది.

"""/" / ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ( Deepika Padukone) తో అట్లీ చేతులు కలిపి నయనతారని అవమానించారని, ఆమె పాత్రకి ఎక్కువగా హైలెట్ చేయకుండా క్రెడిట్ మొత్తం దీపికా పదుకొనేకే ఇచ్చారు అని నయనతార అభిమానులు భావిస్తున్నారు.

అంతేకాదు ఈ విషయంలో నయనతార కూడా చాలా కోపంగా ఉందని, అంతే కాకుండా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఏ సినిమాలో కూడా నటించకూడదని నయనతార (Nayanathara) నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..