రాధా విష‌యంలో చంద్ర‌బాబు అలా డిసైడ్ అయిపోయారా..?

వంగవీటి రాధా.ఇప్పుడు ఈ పేరు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపిస్తున్న పేరు.

అందుకు ఓ కారణం ఉంది.ఇటీవల తన తండ్రి వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది.

ఈ కార్యక్రమంలో వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని కూడా పాల్గొన్నారు.దీంతో రెక్కీ అంశంపై ఆయన తరువాత సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు.

వెంటనే ఈ అంశంపై దర్యాప్తు చేయాలని, అలాగే 2+2 గన్‌మెన్‌లతో భద్రతను కల్పించాలని కూడా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ హీట్‌ను పెంచింది.రెక్కీ చేసి ఉంటే అది చంద్రబాబే చేయించి ఉంటారని వైసీపీ నేతలు ఆరోపించారు.

మరోపక్క రాధాకు ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.

ఇక చంద్రబాబు విజయవాడలోని రాధా ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చారు.అన్ని విధాలుగా అండగా ఉంటామని వచ్చే ఎన్నికల్లో ఎక్కడ సీటు కోరుకున్నా అదే ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

"""/"/ కాపు సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించేందుకు వచ్చే ఎన్నికల్లో విజయవాడ లేదా మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలపాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది.

అయితే అందుకు రాధా ఒప్పుకుంటాడో లేదో చూడాలి మరీ.మరోపక్క వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకురావాలని.

అందులో భాగంగానే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొని రాధాతో మంతనాలు జరిపినట్లు రాజకీయంగా చర్చసాగుతోంది.

మరీ, వంగవీటి రాధా టీడీపీలోనే ఉంటారా లేక మళ్లీ ఫ్యాన్ కిందకు వచ్చి సేద తీరుతారో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి.

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో నిరసన జ్వాలలు..!!