చంద్రబాబు కు మైండ్ బ్లాక్ అయిందా ?

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) వచ్చే ఎన్నికలపై గట్టిగా దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు.

ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేజెక్కించుకోవాలని కలలు కంటున్నారు.గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బాబుకు తాజా పరిణామాలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.

సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో గాని చంద్రబాబు ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టే విధంగా ఉంది.

ఇంతకీ విషయమేమిటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో 2016 నుంచి 2019 మద్య కాలంలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ సబ్ కాంట్రాక్ట్ ల ద్వారా దాదాపు రూ.

118 కోట్లు చేతులు మారతాయని ఆ డబ్బు అంతా బ్లాక్ మని అని ఐటీ శాఖ నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

"""/" / అయితే ఎన్నికల ముందు ఊహించని ఈ పరిణామంతో కంగు తిన్న చంద్రబాబు.

తనకు వచ్చిన నోటీసులు చట్ట పరమైనవి కాదని ఐటీ నోటీసులు జారీ చేసిన తప్పుబడుతూ పలుమార్లు లేఖ రాశారు కూడా.

చంద్రబాబు లేఖను ఐటీ అధికారులు తిరష్కరించి మరోసారి నోటీసులు జారీ చేశారు.దీంతో ఈ అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

అయితే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించేందుకు చూస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. """/" / అతి వైసీపీ( YCP ) నేతలేమో నోటీసులపై చంద్రబాబు ఎందుకు బహిరంగంగా మాట్లాడడం లేదని, అవినీతి చేసిన బాబు తప్పించుకునే అవకాశం లేదని చెబుతున్నారు.

దీంతో ఊహించని విధంగా ఎదురైన ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవలనే దానిపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారట.

అయితే దీని వెనుక ఎవరున్నారనే దానిపై రకాల వాదనలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ పెరుగుతుండడంతో జగన్ సర్కార్ జగన్ ( CM Jagan )సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసు ను చంద్రబాబుపై ఉసిగొలిపిందని టీడీపీ వర్గం ఆరోపిస్తోంది.

అయితే ఈ వ్యవహారంపై బాబు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే మరింత ముదిరి ఎన్నికల వేళ ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.

మరి చంద్రబాబు తన చతురత ప్రదర్శించి ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

కూతురి విజయం పై ఎమోషనల్ అయిన హీరో సూర్య… ఏమైందంటే?