Barack Obama Rishi Sunak : రిషి సునాక్‌తో ప్రైవేట్ మీటింగ్.. వివాదంలో చిక్కుకున్న బరాక్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా( Barack Obama ) వివాదంలో చిక్కుకున్నారు.

సోమవారం యూకే ప్రధాని రిషి సునాక్‌ను( UK PM Rishi Sunak ) కలిసేందుకు ఒబామా 10 డౌనింగ్ స్ట్రీట్‌కు( 10 Downing Street ) వచ్చారు.

2009 నుంచి 2017 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా.సునాక్‌తో తన లాభాపేక్షలేని సంస్థ ‘‘ఒబామా ఫౌండేషన్’’ గురించి చర్చించడానికి యూకేకు వచ్చారు.

రిషితో భేటీలో ఆయన కృత్రిమ మేథ సహా పలు అంశాల గురించి చర్చించారు.

దాదాపు గంటపాటు ఇద్దరు నేతల మధ్య భేటీ జరిగింది.అనంతరం బయల్దేరుతుండగా.

అక్కడ నిరీక్షిస్తున్న బ్రిటీష్ మీడియాను ఒబామా దాటవేశారు.విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఒబామా స్పందించలేదు.

రష్యాపై తన అభిప్రాయాల గురించి అడగ్గా.‘‘టెంప్టెడ్’’ అని ఒబామా కామెంట్ చేశాడు.

చివరిసారిగా 2016లో 10 డౌనింగ్ స్ట్రీట్‌ను ఆయన సందర్శించారు. """/" / అయితే ఒబామా యూకే పర్యటనపై ‘‘ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (ఎంఏజీఏ) ’’ మద్ధతుదారులు (రిపబ్లికన్ పార్టీ) మండిపడ్డారు.

సునాక్‌తో ఒబామా ప్రైవేట్ సమావేశం వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ‘‘ ది లోగాన్ యాక్ట్’’ను( The Logan Act ) కూడా ఒబామా ఉల్లంఘించారని వారు ఆరోపించారు.

ఒబామా ప్రపంచ నాయకులతో ఎందుకు ప్రైవేట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని ట్రంప్ మద్ధతుదారుడొకరు ప్రశ్నించారు.

H3 Class=subheader-styleఅసలేంటీ లోగాన్ చట్టం :/h3p """/" / ఇది అమెరికా ఫెడరల్ చట్టం.

దీని ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికన్లు విదేశీ ప్రభుత్వాలు లేదా నాయకులతో సమావేశం కావడాన్ని నిరోధిస్తుంది.

1799లో ఆమోదించబడిన ఈ చట్టానికి యూఎస్, ఫ్రాన్స్ మధ్య పాక్షిక యుద్ధ సమయంలో ఫ్రాన్స్‌తో అనధికారిక చర్చలు జరిపిన పెన్సిల్వేనియా రాష్ట్ర నేత జార్జ్ లోగాన్ పేరు పెట్టారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిసేందుకు ఒబామా అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతిని పొందలేదని ట్రంప్ మద్ధతుదారులు అనుమానిస్తున్నారు.

ఇది లోగాన్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తున్నారు.ఈ చట్టం ప్రకారం.

దీనిని ఉల్లంఘించిన వ్యక్తులకు మూడేళ్లకు పైగా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.

దాదాపు 200 ఏళ్లుగా లోగాన్ చట్టం అమల్లో వుండగా.ఇప్పటి వరకు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే దీనిని ఉల్లంఘించినట్లుగా అభియోగాలు మోపగా.

వారిలో ఎవరికీ శిక్ష పడలేదు.

కేవలం ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు వద్దన్నా కూడా మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది!