శంకర్ కూతురే టార్గెట్ గా నటి ట్వీట్.. చాలా ఈజీగా హీరోయిన్ అయిపోతున్నారంటూ!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ లో నెపోటిజం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

అయితే ఈ నెపోటిజం అన్న పేరు ఎక్కువగా బాలీవుడ్ లోనే వినిపిస్తూ ఉంటుంది.

అయితే అలాంటిది ఇప్పుడు ఆ నెపోటిజం అన్న పదం దక్షిణాదిలో సైతం వినిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక నటి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అంతే కాకుండా ఆ నటి చేసిన ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.

తాజాగా ఆ నటి సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్ చేసింది.సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా.

మరి మిగతావాళ్ల సంగతేంటి అంటూ ఆమె ట్వీట్‌ చేసింది.అయితే ఆ నటి చేసిన ట్వీట్ ని బట్టి చూస్తే అది డైరెక్టర్ శంకర్ కూతురు అతిథి శంకర్ ను ఉద్దేశించి ఆమె ఆ ట్వీట్ చేసింది అని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కోలీవుడ్‌ బంధుప్రీతి (నెపోటిజం) పై తొలిసారి నోరు విప్పిన ఈ నటి ఇటీవలె సినీ ఇండస్ట్రీలి ఎంట్రీ ఇచ్చింది.

అంతేకాకుండా సదరు నటి ఇప్పటివరకు ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించింది.ఆ నటి పేరు ఆత్మిక.

మిసాయి మురుకు అనే తమిళ చిత్రంతో ఆమె కోలీవుడ్‌ కీ హీరోయిన్ పరిచయమైంది.

అయితే ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు మాత్రం తగిన గుర్తింపు దక్కలేదు.

అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆఫర్లు లేవు. """/"/ దీంతో ప్రస్తుతం ఈమె అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తరచుగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

ఈ నేపథ్యంలోనే అతిథి శంకర్ కూతురిపై పరోక్షంగా ఆమె ఈ ట్వీట్ చేసినట్లు సమాచారం.

కాగా అదితి శంకర్ ప్రస్తుతం నటించే ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే.అలాగే సింగర్‌గా కూడా రాణిస్తోంది.

ఆమె నటించింది ఒకటే సినిమా అయిన ఆ వెంటనే పెద్దపెద్ద ఆఫర్లు రావడంతో ఆత్మికకు అదితి పై కన్ను పడినట్లు ఉందని, అందుకే పరోక్షంగా ఆమెను టార్గెట్‌ చేసి ఈ ట్వీట్‌ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరి ఈ ట్వీట్ ఇంకా ఎంతటి వివాదానికి తెర లేపుతుందో చూడాలి మరి.