డైమండ్ రత్నబాబు ఈ సంవత్సరం భారీ సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా..?
TeluguStop.com
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu Film Industry ) చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న 'డైమండ్ రత్నబాబు'( Diamond Ratna Babu ) రెండు సినిమాలను డైరెక్షన్ చేశాడు.
అందులో మొదటిది ఆది హీరోగా వచ్చిన 'బుర్రకథ ' సినిమా కాగా, రెండోవది సప్తగిరి సన్నీ ప్రధాన పాత్రల్లో వచ్చిన అన్ స్టాపాబుల్.
ఈ రెండు సినిమాలు కూడా ఆవరేజ్ గా నిలిచాయి. """/" /
రైటర్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మాత్రం పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోయాడు.
నిజానికి ఆయనకు మంచి టాలెంట్ అయితే ఉంది.తన టాలెంట్ ని వాడుకొని మరోసారి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
మరి ఈ సినిమాలతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ముఖ్యంగా ఆయన కామెడీ సినిమాలకు పెద్దపీట వేస్తే మాత్రం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
"""/" /
ఇక అనిల్ రావిపూడి మాదిరిగా ఆయన కూడా ఒక యూనిక్ స్టైల్ లో డైరెక్షన్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగే కెపాబులిటీ ఉన్న రైటర్ కం డైరెక్టర్ కావడం విశేషం.
ఇక ఇప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా చేస్తే మాత్రం ఆయనకు చాలా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది.
ఇక ఏది ఏమైనా కూడా డైమండ్ రత్నబాబు తొందర్లోనే కంబ్యాక్ ఇవ్వబోతున్నాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆయన ప్రస్తుతం చాలా వరకు ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక ఆయన పూర్తి ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.