అనంతగిరి మండలంలో వజ్రాల వేట

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని పాలేరు వాగు పరివాహక గ్రామమైన కిష్టాపురంలో జనం వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు.

పాలేరు వాగు పక్కన గల వ్యవసాయ భూమిలో కొందరికి వజ్రపురాళ్ళ లాంటివి దొరకాయని తెలియడంతో గ్రామస్తులందరూ పొలాల్లో వెతుకులాట షురూ చేశారు.

తుఫాన్ ప్రభావంతో పాలేరు వాగు వరద భీభత్సం సృష్టించడంతో గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరి గ్రామం మొత్తం బురదమయం అయింది.

గ్రామాన్ని,ఇళ్లను శుభ్రపరుచుకోవడం పక్కన పెట్టి ఒక్క వజ్రం అయినా దొరకకపోతుందా అంటూ పిల్లా జెల్లా వజ్రపు రాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ విషయం కాస్త ఆ నోటా ఈ నోటా పడి పాలేరు వాగు పరివాహక ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పొలం బాట పట్టారు.

అవి వజ్రపు రాళ్ళా కాదా అనేది పక్కన పెడితే విపత్తు జరిగి నష్టాల్లో ఉన్న వారు కూడా అన్ని మరిచి వజ్రాల వేటలో మునిగిపోవడం గమనార్హం.

తెలుగు వాళ్లంటే ఆ హీరోలకు అంత చిన్న చూపా.. అందుకే మౌనం పాటిస్తున్నారా?