సీనియర్ స్టార్ హీరోలపై దియామీర్జా సంచలన వ్యాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలో హీరోలు వరుస విజయాలతో సక్సెస్ అయితే స్టార్ హీరోలుగా సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగిస్తారనే సంగతి తెలిసిందే.

ఐదు దశాబ్దాలుగా, నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు.

ఈ హీరోలలో కొందరు హీరోలు వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటుంటే మరి కొందరు మాత్రం ఇప్పటికీ కుర్ర హీరోయిన్లను తమ సినిమాల్లో హీరోయిన్లుగా ఎంచుకుంటూ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు.

మోడల్ గా, నటిగా, నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్న దియామీర్జా అలా కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న సీనియర్ స్టార్ హీరోలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

50 సంవత్సరాల సీనియర్ హీరో కూడా 19 ఏళ్ల కుర్ర హీరోయిన్ తన సినిమాల్లో ఉండాలని కోరుకుంటున్నాడని ఇలాంటివి చూడటం దురదృష్టకరం అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా రంగంలో పురుషుల డామినేషన్ ఎక్కువని దియా పేర్కొన్నారు. """/"/ అయితే గతంతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి కొంత మెరుగుపడిందని హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు, అవకాశాలు వస్తున్నాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాను హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనను దారుణంగా అవమానించారని ఆమె కామెంట్లు చేశారు.

వయస్సు పెరుగుతున్నా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అవకాశాలు వస్తున్నాయని హీరోయిన్లకు మాత్రం రావడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రధాన పాత్రల్లో వయస్సు మళ్లిన హీరోలు నటించడం దురదృష్టకరం అని దియామీర్జా పేర్కొన్నారు.

దియా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.నెటిజన్లలో కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న వైల్డ్ డాగ్ సినిమాలో దియామీర్జా నటిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..