కాచుకోండి.. కాంతారా, కేజీఎఫ్ సినిమాలను మించి రాబోతున్న అర్జున్ మేనల్లుడి సినిమా !

ప్రస్తుతం యావత్ ఇండియా సినీ అభిమానుల చూపు తెలుగు మరియు కన్నడ ఇండస్ట్రీ పైనే ఉంది.

ఎందుకంటే ఓవైపు తెలుగు సినిమాలు మరోవైపు కన్నడ సినిమాలే ఎక్కువగా హిట్లు కొడుతూ ఫ్యాన్ ఇండియా వ్యాప్తంగా వసూళ్లు సాధిస్తున్నాయి.

పైగా ఓవైపు సౌత్ పరిశ్రమ లేచి కూర్చుంటే బాలీవుడ్ దుప్పటి కప్పుకొని పడుకుంది కాబట్టి సినీ ప్రేమికులు ఎలాంటి మంచి సబ్జెక్టుతో కొత్త సినిమాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

అయితే తెలుగుతో పోలిస్తే కన్నడ ఇండస్ట్రీలో విజయాలు ఎక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి కాంతారా, కేజిఎఫ్ పార్ట్ 1 మరియు సీక్వెల్, చార్లీ 777 విక్రాంత్ రొన వంటి చిత్రాలు పాన్ వ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి.

"""/" / ఇక ఇప్పుడు వీరికి సవాల్ విసురుతున్నాడు యాక్షన్ హీరో అర్జున్ అల్లుడు ధ్రువ సర్జా.

యష్ రిషబ్ శెట్టిలకు తానేమి తీసిపోను అంటూ ఒక భారీ సినిమాతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు ఇప్పటికే ఏడాది పాటు షూటింగ్ జరుపుకుంటుంది కేవలం ట్రైలర్ విడుదల చేసి సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశాడు ధ్రువ ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కొన్నాళ్లపాటు జరగగా వైజాగ్ లో మరికొన్ని రోజులు జరుగుతోంది.

ఆ తర్వాత కాశ్మీర్లో పలు సీన్లు షూట్ చేశాక కేవలం క్లైమాక్స్ కోసమే 40 రోజులు సమయం తీసుకున్నారు బహుశా ఇంత పెద్ద ఐస్ ఫైట్ ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు.

పైగా క్లైమాక్స్ కోసం భారీ దేహం కలిగిన నెక్ జిలా, నాథన్ జోన్స్ నీ తీసుకున్నారు.

"""/" / వైభవి శాండిల్య అనే హీరోయిన్ ఈ చిత్రం కోసం తీసుకున్న హీరో హీరోయిన్స్ మధ్య రోమాన్స్, పాటలు పెద్దగా ఏమీ ఉండవు.

ఇక ఈ ప్రయోగాత్మక చిత్రానికి అర్జున్ అనే వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇతడు తీసినవి ఇప్పటికి కేవలం నాలుగు సినిమాలు అయినా ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ తనదైన రీతిలో చిత్రాలను విజయవంతం చేసుకుంటున్నాడు.

ఇక ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులను అలరిస్తుందని గట్టిగా చెబుతున్నాడు.ఈ సినిమాకి మార్టిన్ అనే పేరును ఖరారు చేశారు.

ఇక ఈ సినిమాలో నటించినా ధ్రువ 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటివరకు ఐదారు సినిమాల్లోనే కనిపించాడు ఇవి కూడా పెద్ద సినిమాలు అని చెప్పుకోవడానికి లేదు.

అయినా కూడా ఇంతటి భీకరమైన యాక్షన్స్ సినిమాలో ధ్రువ నటించడం అర్జున్ ఫ్యాన్స్ ని ఇటు కన్నడ ఫాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది.

విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి నటించిన ఈ సినిమా గురించి తెలుసా?