Dasara Movie :ఆకట్టుకుంటున్న దసరా ధూమ్ ధామ్ సాంగ్.. వీడియో సాంగ్ చూస్తే వావ్ అనాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ( Nani )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు నాని.ఇకపోతే నాని చివరగా అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోని మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు హీరో నాని.

నాని తాజాగా నటించిన చిత్రం దసరా( Dasara ).ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమా ఈనెల 30వ తేదీన విడుదల కానుంది.

కాగా ఇప్పటికే దసరా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

"""/" / అంతేకాకుండా సినిమా ట్రైలర్ పాటలు ఈ సినిమాపై ఓ రేంజ్‌లో బజ్‌ను క్రియేట్‌ చేశాయి.

విడుదల తేదీకి మరి కొద్దిరోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

ఇక ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమాలోని ధూమ్ ధామ్ దోస్తాన్ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

ముంబైలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్‌లతో రానా, దీక్షిత్‌ శెట్టి కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఈ సినిమా పక్కా విలేజ్‌ బ్యాక్‌గ్రాండ్‌లో మాస్‌ ఎంటర్‌టైనర్‌లా తెరకెక్కనున్న విషయం మనందరికీ తెలిసిందే.

"""/" / ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నాని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అంతే కాకుండా హీరో నాని మొదటిసారిగా ఇందులో మాస్ లుక్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు లవర్ బాయ్ గా కనిపిస్తూ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ సినిమాలు చేసిన నాని మొట్టమొదటిసారిగా మాస్ పాత్రలో నటించడంతో పాటు పాన్ ఇండియా సినిమాలో నటించాడు.

తెలుగులో స్టార్ హీరోలైనా సరే.. ఇవి చేయడం మాత్రం వీరి చేత కాదు..?