MS Dhoni : ఈ ఐపిఎల్ సీజన్ లో ధోనీ కి విపరీతం గా పెరుగుతున్న క్రేజ్… కారణం ఏంటంటే..?
TeluguStop.com
ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరూ ఐపీఎల్( IPl ) మ్యాచ్ లా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున ధోని ఆడబోయే చివరి సీజన్ కావడం వల్ల చెన్నై టీమ్ ఫ్యాన్స్ తో పాటు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఈసారి ధోని ఎక్కువ మ్యాచ్ ల్లో బ్యాటింగ్ చేస్తే చూడాలని ఆసక్తితో ఉన్నారు.
ఎందుకంటే ఈ సీజన్ కనక ముగిసినట్లయితే ధోని ఇక ఏ లీగ్ లో కూడా పాల్గొనడు దానికి తగ్గట్టుగానే ఆయన బ్యాటింగ్ కూడా చేయడు.
"""/" /
కాబట్టి ఈ సీజన్ లోనే ధోని( MS Dhoni ) కి ఎక్కువగా బ్యాటింగ్ రావాలని తను సత్తా చాటుకోవాలని ప్రతి ఒక్క అభిమాని కూడా ఎదురుచూస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే చెన్నై మ్యాచ్ లకు ఈసారి విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే చెన్నై మ్యాచ్ లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ మ్యాచ్ లను డైరెక్ట్ గా స్టేడియం లో చూడడానికి అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇదిలా ఉంటే ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
కేవలం ఫ్యాన్స్ ని అలరించడానికి మాత్రమే తను ఈ సీజన్ కూడా ఆడబోతున్నట్టుగా గతంలో తెలియజేశాడు.
"""/" /
మరి ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే ఈ సీజన్ లో కూడా భారీ పరుగులు చేసి వాళ్ళందరి ఉత్సాహపరుస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే చెన్నై సూపర్ కింగ్స్ టీం ఈసారి కూడా కప్పు కొట్టాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈసారి కప్పు కొడితే ధోని కెప్టెన్ గా ఐపిఎల్ లో 6 కప్పులను సాధించిన ఏకైక కెప్టెన్ గా గుర్తింపు పొందుతాడు.
అలాగే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కూడా టీం నుంచి రిటర్మెంట్ ప్రకటించిన ప్లేయర్ అవుతాడనే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.