ప్రదీప్ నిజస్వరూపం బయటపెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నారంటూ?

బుల్లితెర యాంకర్ ప్రదీప్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.వివాదాలకు దూరంగా ఉండే యాంకర్లలో ప్రదీప్ ఒకరు.

ప్రదీప్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

ఈటీవీ, జీ తెలుగు ఛానల్ లలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ లో ప్రదీప్ ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తుంటారు.

ప్రదీప్ సన్నిహితులు సైతం ప్రదీప్ చాలా మంచి వ్యక్తి అని చెబుతారు.సోషల్ మీడియాలో ప్రదీప్ యాక్టివ్ గా ఉండకపోయినా సెలబ్రిటీలలో చాలామంది ప్రదీప్ గురించి పాజిటివ్ గా చెబుతారు.

ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా నటించి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.

ఢీ14 కంటెస్టెంట్లలో ఒకరైన ప్రసాద్ ప్రదీప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నాకు చికిత్స జరుగుతున్న సమయంలో చర్మం పాడైందని సర్జరీ కోసం ఆ సమయంలో ప్రదీప్ అన్నకు ఫోన్ చేశానని ప్రసాద్ తెలిపారు.

ఆ సమయంలో తన సమస్య విన్న వెంటనే ప్రదీప్ అన్న కాల్ కట్ చెయ్ అని చెప్పాడని ప్రసాద్ చెప్పుకొచ్చారు.

"""/"/ కాల్ కట్ చేసిన వెంటనే ప్రదీప్ అన్న అకౌంట్ నుంచి నా అకౌంట్ కు డబ్బులు జమయ్యాయని ప్రదీప్ అన్న చాలా మంచి వ్యక్తి అని ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ప్రసాద్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రదీప్ రీల్ లైఫ్ లోనే కాదని రియల్ లైఫ్ లో కూడా హీరో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ ప్రదీప్ హీరోగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరోవైపు ప్రదీప్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

ప్రదీప్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతాడో చూడాల్సి ఉంది.

వైరల్ వీడియో: దేవుడా ఎంత పెద్ద జీవిని ఎరగా మింగేసిన కింగ్ కోబ్రా.. చివరకి..