ఢీ 13 ఫైనల్స్.. గెస్ట్ ఎవరో తెలుసా..!
TeluguStop.com

ఈటీవీ ఢీ డ్యాన్స్ షో అంటే ఎంతో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే.


సౌత్ డ్యాన్స్ షోలలో ఈటీవీ ఢీ 12 సీజన్లుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.


ప్రస్తుతం ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్ కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంది.
కింగ్స్ వర్సెస్ క్వీన్ అంటూ బోయ్స్ అండ్ గాళ్స్ పోటాపోటీ పడుతున్నారు.ప్రస్తుతం సెమీ ఫైనల్స్ నడుస్తున్న ఢీ 13 షోలో త్వరలో ఫైనల్స్ జరుగనున్నాయి.
అయితే ఢీ 13 ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ ఎవరన్నది తెలిసిపోయింది.ఢీ 13 షోలో ఫైనల్స్ కు ఈసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది.
ఢీ అంటేనే డ్యాన్స్.అలాంటి డ్యాన్స్ షో ఫైనల్ ఎపిసోడ్ కు టాలీవుడ్ డ్యాన్సింగ్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది.
సెమీ ఫైనల్స్ లో కింగ్స్ వర్సెస్ క్వీన్ టీం నుండి నలుగురు సభ్యులు ఎంపిక అవుతారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఈ పోటీ జరుగుతుంది.పోటీలో గెలిచిన వారికి ఢీ 13 టైటిల్ షీల్డ్ వచ్చేస్తుంది.
మరి అల్లు అర్జున్ తో షీల్డ్ అందుకునే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.
దసరా విలన్ పై మరో నటి ఆరోపణలు.. సెట్ లో అసభ్యంగా ప్రవర్తించారంటూ?