ఈనెల 18 నుండి మినీ గురుకుల ఉద్యోగుల ధర్నా

సూర్యాపేట జిల్లా: ఈనెల 18 నుండి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన మినీ గురుకులం (బాలికలు)లో పని చేస్తున్న ఉద్యోగులు ధర్నాకు దిగనున్నట్లు మినీ గురుకులాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.

జ్యోతి తెలిపారు.గురువారం రాష్ట్ర వ్యాప్త ధర్నాకు సంబంధించి నలగొండ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఆర్.

సి.ఓకి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ధర్నా కొనసాగిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

వీడియో: బైక్‌ చక్రంతో ట్రైన్‌లోని ప్యాసింజర్లపై నీళ్లు చల్లారు.. కట్ చేస్తే??