ఉపాధిహామీ కార్మికుల ధర్నా
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:ఉపాధిహామీ పథకం కింద పనిచేసిన వారికి 5,6 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధి కార్మికులు మాట్లాడుతూ దాదాపు 5,6 నెలల క్రితం పనిచేసిన వారికి ఇంతవరకు ఒక్క వారం కూడా పైసలు పడకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఫలితం లేకపోవడంతో ఎంపిడిఓ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారులు వెంటనే స్పందించి ఉపాధి కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.