నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టరేట్ ముందు ధర్నా…!

సూర్యాపేట జిల్లా:జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.

కోటేశ్వరరావు,రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొనిమాట్లాడుతూ అకాల వర్షాలతో పిఎసిఎస్,ఐకెపి సెంటర్లలో,మార్కెట్లలో రోడ్ల వెంట ఆరబోసిన లక్షల టన్నుల ధాన్యం తడిచిందని,ఇంకా కోతలు కాని వరిపొలాలు యంత్రాలతో కోసే వీలు లేకుండా నేలకు అతుక్కుపోయాయని,వడగండ్లతో ధాన్యం రాలిపోయి రైతుకు కడగండ్లు మిగిల్చాయని అవేదన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోళ్లలో ఆయా శాఖల అధికారులు బాధ్యతగా వ్యవహరించలేదన్నారు.

అందుకే కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యమంతా తడవకుండా టార్పాలను సమకూర్చలేక ఉన్న వాటిని సకాలంలో అందించినా గాలి తీవ్రతకు లేచిపోయాయన్నారు.

సూర్యాపేట మార్కెట్ లోనే కాంటావేసిన ధాన్యం 50వేల బస్తాలు తడిసిందని,కాంటా వేసిన ధాన్యాన్ని ఎగుమతి చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

రైతులు అదనంగా రెండు మూడు వేయిల రూపాయలు ఇస్తేనే లారీలో ధాన్యం తీసుకెళ్తామని రుబాబు చేస్తున్నా పట్టించుకునే వారే లేరన్నారు.

వడగళ్లు, పిడుగులతో ఒకటి రెండు గేదలు చనిపోయాయని, మామిడికాయలు 70% రాలిపోయాయన్నారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మద్దతు ధర కంటే తక్కువ కొనకుండా పూర్తి ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,నష్టపోయిన పంటలను ప్రభుత్వం ప్రకటించిన రుణ పరిమితి వరికి రూ.

45 ఇవ్వాలనిడిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు పోటు లక్ష్మయ్య,బొడ్డు శంకర్,జిల్లా నాయకులు కనకారావు,అలుగుబెల్లి వెంకటరెడ్డి,గంట నాగయ్య,ఉదయగిరి, కమల్లా,నవీన్,కునుకుంట్ల సైదులు,పోలబోయిన కిరణ్,కారింగుల వెంకన్న, నర్సక్క,నల్గొండ నాగయ్య, ఎస్కే.

సయ్యద్,నర్సిరెడ్డి, జాన్ రెడ్డి,నగేష్,నవీన్, ప్రవీణ్,బండి రవి,మురళి తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో.. అమెరికా అధ్యక్ష భవనంలో ’సారే జహాసే అచ్ఛా’ పాట.. గూస్ బంప్స్..