డీఏవీ స్కూల్ ఘటనపై విద్యార్థి, మహిళా సంఘాల ధర్నా

హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనపై విద్యార్థి, మహిళా సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.డీఏవీ స్కూల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అదేవిధంగా ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి.

ఈ క్రమంలో నిరసన చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అయితే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేపథ్యంలో స్కూల్ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఢిల్లీ నుంచి డీఏవీ స్కూల్ డైరెక్టర్స్ బృందం హైదరాబాద్ కు చేరుకుంది.

ఇప్పటికే ఘటనకు స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించింది.

తన చేతివంటను రుచి చూపించిన నాగ చైతన్య.. వీడియో వైరల్