బండి సంజ‌య్‌కు దూరంగా ఉంటున్న ధ‌ర్మ‌పురి.. ఏంది క‌థ‌..?

సెంట్ర‌ల్ బీజేపీలో న‌రేంద్ర మోడీ అమిత్ షా ఎలాగో తెలంగాణ‌లో కూడా బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర‌వింద్ అలా అన్న‌ట్టు మొన్న‌టి వ‌ర‌కు ఉండేది.

ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఇద్ద‌రూ క‌లిసే పెట్టేవారు.ఇద్ద‌రూ క‌లిసే వ్యూహ ర‌చ‌న‌లు చేసేవారు.

అంత‌లా పార్టీలో త‌మ ఉనికిని చాటుకున్నారు.ఈ ఇద్ద‌రూ దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ఎంత‌లా ప్ర‌భావం చూపారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

వారిద్ద‌రూ క‌లిసే ఆ రెండు ఎన్నిక‌ల‌కు వ్యూహాలు అమ‌లు చేశారు.దాంతో వారిద్ద‌రి పేరు అన్ని పార్టీల్లో క‌ల‌వ‌రం రేపింది.

ఇక బండి సంజ‌య్ మీద ఎవ‌రు విమ‌ర్శ‌లు చేసినా గ‌ట్టిగా బ‌దులు ఇస్తుంటారు ధ‌ర్మ‌పురి అర‌వింద్‌.

కానీ ఇప్పుడు సీన్ మారింది.ఈటల రాజేంద‌ర్ ఎప్పుడైతే కాషాయ‌గూటికి వ‌చ్చారో అప్ప‌టి నుంచి ధ‌ర్మ‌పురి అర‌వింద్ కాస్త సైలెంట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఆయ‌న‌కు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో మంచి ఫాలోయింగ్ ఉంది.దాంతో ఆయ‌న‌కు మాస్ లీడ‌ర్ అనే ఇమేజ్ కూడా వ‌చ్చింది.

కానీ ఈట‌ల రాజేంద‌ర్ రాక‌తో కొన్ని గ్రూపు రాజ‌కీయాలు మొద‌లైన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది.

మొద‌టి నుంచి బండి సంజ‌య్ కు చెక్ పెట్టేందుకు ఈట‌ల‌ను తీసుకొస్తున్నార‌నే ప్ర‌చారం బీజేపీలో ఉంది.

కానీ అన‌నూహ్యంగా ఈట‌ల రాజేంద‌ర్‌కు బండి సంజ‌య్ మంచిగానే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. """/"/ ఇప్పుడు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో కూడా బండి మ‌ద్ద‌తుతోనే ఈట‌ల ముందుకు వెల్తున్నారు.

కాగా ధ‌ర్మ‌పురి మాత్రం కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న క‌నిపించ‌ట్లేదు.

మ‌రీ ముఖ్యంగా బండి సంజ‌య్ పాద‌యాత్ర చేసినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆయ‌న మాత్రం కాన‌రావ‌ట్లేదు.

దీంతో వారిద్ద‌రి మ‌ధ్య ఏమైనా గ్యాప్ వ‌చ్చిందా అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇంకోవైపు కిష‌న్ రెడ్డి కూడా ఎలాంటి యాక్టివ్ పాలిటిక్స్‌లో లేక‌పోవ‌డంతో వ‌ర్గ‌పోరు నిజంగానే మొద‌ల‌యిందా అనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

ఆ డైరెక్టర్లతో ప్లాన్ చేయొచ్చుగా బాలయ్యా.. మోక్షజ్ఞ విషయంలో ఇలా చేయడం రైటా?