‘ద్వారంపూడి ‘ టార్గెట్ అయ్యారా ? కేసు తప్పదా ? 

గత వైసిపి ప్రభుత్వంలో టిడిపి,  జనసేన ను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారందరి వ్యవహారాలను నిగ్గు తేల్చే పనిలో కూటమి ప్రభుత్వం నిమఘ్నం అయ్యింది  ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వారి అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ,వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, అరెస్టులు చేయించాలనే పట్టుదలతో టిడిపి కూటమి ప్రభుత్వం ఉంది.

దీనిలో భాగంగానే కాకినాడ పట్టణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి వ్యవహారాలపై ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది .

ముఖ్యంగా కాకినాడ పోర్ట్ ( Kakinada Port )నుంచి అక్రమ రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు చంద్రశేఖర్ రెడ్డి పైన ఉన్నాయి.

దీనిపై విచారణను మొదలుపెట్టింది. """/" / తాజాగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో  కాకినాడలో రేషన్ బియ్యాన్ని దేశాన్ని దాటించిన వ్యవహారం పై చర్చించారు.

దీనిపై త్వరలోనే కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.జనసేన కీలక నేత ,ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) కాకినాడలోని పలు గోదాముల్లో దాడులు చేసి ఇప్పటికే రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.

  దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నారు.  ప్రత్యేకంగా కొంతమంది అధికారులు దీనిపై ఫోకస్ చేశారు.

కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు పంపించడం పైన, దీనికి సహకరించిన అధికారుల పైన వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

  దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు.కోర్టులో ఈ వ్యవహారం లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

"""/" / గత వైసిపి ప్రభుత్వం లో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి అటు టిడిపి , జనసేనకు ఉమ్మడి శత్రువు గానే మారారు .

పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు,  చంద్రబాబు లోకేష్ పైన వ్యక్తిగత విమర్శలు చేయడం , స్వయంగా పవన్ ను ( Pawan Kalyan )కాకినాడ సిటీ నుంచి తనపై పోటీ చేయాల్సిందిగా సవాల్ విసరడం, వంటి వాటిని పవన్ తో పాటు , టిడిపి సీరియస్ గానే తీసుకుంది.

అప్పట్లోనే ద్వారంపూడి వ్యవహారంపై స్వయంగా పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేశారు.దీనిలో భాగంగానే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయించే విధంగా వ్యూహం సిద్ధం చేస్తున్నారు.

ఎన్నికల హామీల అమలు ఇప్పట్లో కష్టమేనా ? బాబు అలా ఫిక్స్ అయ్యారా ?