‘సార్’ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు.. కాంట్రవర్సీ సీన్స్ ఉండడంతో..

తమిళ్ హీరోల్లో చాలా మందికి ఇక్కడ కూడా మార్కెట్ ఉంది.అక్కడి స్టార్ హీరోలు ఇక్కడ సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి టాక్ వస్తే బాగానే కలెక్షన్స్ సాధిస్తాయి.

ఇలాంటి డబ్ చేసిన సినిమాలు మన టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇక తమిళ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు.ఈయనకు తెలుగులో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.

ధనుష్ కొన్ని సినిమాలు ఇక్కడ బాగా హిట్ అయ్యాయి.దీంతో ప్రతీ సినిమా డబ్ చేసి రిలీజ్ చేస్తునాన్రు.

ఇక ప్రెజెంట్ ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ''సార్''.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.

"""/"/ తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి సినిమాల తర్వాత వెంకీ అట్లూరి ఈసారి ప్రేమకథలను వదిలేసి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సార్ సినిమా సోషల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించినట్టు సమాచారం.కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై సెటైరికల్ గా ఈ సినిమాను తీసినట్టు టాక్.

ఇక ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగానే ఉన్నాయి.ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది.

"""/"/ మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో రిలీజ్ కు ముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా సెన్సార్ కు వెళ్లినట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో కాంట్రవర్సీ క్రియేట్ చేసే కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పినట్టు టాక్.

ఆ సన్నివేశాలను కాస్త సరిచేయమని సూచించినట్టు తెలుస్తుంది.ఈ సినిమా 2.

03 గంటలు నిడివి ఉంటుందని సమాచారం.మరి ఈ సినిమా వెంకీ ఎలా తెరకెక్కించాడో వేచి చూడాల్సిందే.

నాలుగేళ్లలోనే పోలీస్ అవతారం ఎత్తాడు.. కేసులు సాల్వ్ చేశాడు..?