ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' అనౌన్స్.. కోలీవుడ్ లో అన్ని రికార్డులు గల్లంతు!
TeluguStop.com
జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న నటుడు ధనుష్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.
ఈయన కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు.అయితే ధనుష్ అక్కడే ఉండిపోకుండా ఇటు తెలుగుతో పాటు హిందీ, హాలీవుడ్ మూవీస్ లో కూడా తనని తాను నిరూపించు కునేందుకు తీవ్రంగా కష్టపడు తున్నాడు.
ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.
ఈ సినిమా పట్టాలెక్కక ముందే మరో డైరెక్టర్ తో సినిమా ప్రకటించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.'సార్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.
మరి ఈ రెండు సినిమాలతో ధనుష్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటాడో లేదో చూడాలి.
ఇది పక్కన పెడితే తాజాగా ధనుష్ మరొక కొత్త సినిమా ప్రకటించాడు.ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో విడుదల చేసారు.
అయితే ఈ సినిమా నుండి విడుదల అయినా ఈ వీడియో కొద్దీ సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
"""/"/ ధనుష్ నుండి పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా నుండి ధనుష్ కొత్త లుక్ రివీల్ చేస్తూ టైటిల్ కూడా రిలీజ్ చేసారు.
కెప్టెన్ మిల్లర్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ధనుష్ లుక్ అందరిని మెస్మరైజ్ చేసింది.
ఈయన అనౌన్స్ మెంట్ తోనే కోలీవుడ్ మీడియాలో రికార్డులన్నీ తిరగరాసాడు.ఈ వీడియో కోలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
కేవలం 24 గంటల్లోనే 5.5 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది.
సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాంక్రోల్ నిర్మిస్తున్న ఈ బహుభాషా సినిమాను అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తుండగా.
జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
డస్ట్ అలెర్జీ తో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!