ప్రమోషన్స్ కి రావడానికి ధనుష్ అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా?

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సార్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

తమిళం లో వాతిగా విడుదల కాబోతున్న ఈ సినిమా ను తెలుగు లో సార్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

తమిళం లో మరియు తెలుగు లో కూడా సినిమా ను ప్రమోషన్ చేసేందుకు ధనుష్ దాదాపు రెండు వారాల సమయాన్ని కేటాయించాడు.

సార్ సినిమా యొక్క పబ్లిసిటీ లో భాగంగా హైదరాబాద్ కి రెండు సార్లు వచ్చిన ధనుష్ ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

సినిమా యొక్క పబ్లిసిటీ కి తమిళనాడు లో అదనంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందట.

అందుకే ధనుష్‌ ఈ సినిమా యొక్క పబ్లిసిటీ కోసం రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ధనుష్ దాదాపు 50 లక్షల రూపాయలు అదనంగా పబ్లిసిటీకి తీసుకున్నాడు అనే ప్రచారం జరుగుతుంది.

కానీ ఇండస్ట్రీలోని కొందరు మాత్రం సినిమా చేయడం తో పాటు పబ్లిసిటీ చేయడం కూడా హీరో బాధ్యత కనుక ధనుష్ పబ్లిసిటీ కోసం ప్రత్యేకంగా రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడు అంటే నమ్మశక్యంగా లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ఇది కావాలని కొందరు ధనుష్ అంటే ఇష్టం లేనివారు ప్రచారం చేస్తున్నారని అంతే తప్ప దీంట్లో నిజం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సార్ చిత్రం సక్సెస్ అయితే తెలుగు లో కచ్చితంగా మంచి క్రేజ్ దక్కే అవకాశాలు ధనుష్ కి పుష్కలంగా ఉన్నాయి.

కనుక ఆయన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం.అసలు విషయం ఏంటి అనేది చూడాలి.

ధనుష్ యొక్క పబ్లిసిటీ తో సార్ కి మంచి క్రేజ్ వచ్చింది.ఆ మధ్య వచ్చిన వారసుడు సినిమా కు విజయ్ హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ చేయని కారణంగా నష్టం జరిగిన విషయం తెల్సిందే.

వీడియో వైరల్: తెలివి చల్లగుండా.. పాత టీవీని ఇలా ఎలా మార్చావు బ్రో..