సార్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
TeluguStop.com
డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా సార్.ఇదే సినిమా తమిళంలో వాతిగా కూడా రూపొందింది.
ఇందులో ధనుష్, సంయుక్త మీనన్ నటీనటులుగా నటించారు.ఇక సముద్ర ఖని, హైపర్ ఆది తదితరులు ఈ సినిమాలో నటించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.జే యువరాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక సాంగ్స్ కూడా యూట్యూబ్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.అలా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా వారిని ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
H3 Class=subheader-styleకథ:/h3p కథ విషయానికి వస్తే.మొత్తం 1998 నుండి 2000 కాలంలో జరిగిన కథగా రూపొందింది.
ఇక ఇందులో శ్రీనివాస్ త్రిపాఠి (సముద్ర ఖనీ) త్రిపాఠి విద్యాసంస్థల చైర్మన్ గా బాధ్యతలు చేపడతాడు.
అయితే అతడు విద్యను ఒక వ్యాపారంగా భావిస్తాడు.క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటూ విద్యార్థుల దగ్గర భారీ ఫీజులు వసూలు చేస్తాడు.
ఇక ప్రభుత్వ కాలేజీలు మూతపడేలా చేస్తాడు.ఇక చైర్మన్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుంది.
ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం ఒక జీవో ని తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది.
దీంతో ప్రభుత్వంతో శ్రీనివాస్ త్రిపాఠి ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. """/" /
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు దత్తత తీసుకొని తమ విద్యా సంస్థల ఫ్యాకల్టీతో ఉచితంగా విద్యను అందిస్తాము అని అంటడు.
దాంతో ప్రభుత్వం కూడా ఓకే అంటుంది.త్రిపాఠి తమ దగ్గర పనిచేసే జూనియర్ లెక్చరర్లను ప్రభుత్వ కాలేజీకి పంపిస్తాడు.
అందులో బాలగంగాధర్ తిలక్ (ధనుష్) కడప జిల్లా సిరిపురం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కి వెళ్తాడు.
ఇక శ్రీనివాస్ త్రిపాఠి మాత్రం దత్తత పేరుతో ఆ విద్యాసంస్థల నాశనం చేయాలని టార్గెట్ చేస్తాడు.
ఇక బాలగంగాధర్ తిలక్ మాత్రం విద్యార్థులను పాస్ చేయించి ప్రమోషన్స్ సాధించాలన్నది అనుకుంటాడు.
దీంతో తన ప్రమోషన్స్ ఎదుర్కోవటం కోసం ఆయన పడిన సమస్యలు.చివరికి త్రిపాఠి చేస్తున్న కుట్రను బాలగంగాధర్ తిలక్ ఎలా బయటపడతాడు.
చివరికి తను అనుకున్న లక్ష్యానికి చేరుకుంటాడా లేదా అన్నది మిగిలిన కథలోనిది. """/" /
H3 Class=subheader-styleనటినటుల నటన:/h3p నటీనటుల విషయానికి వస్తే.
ధనుష్ తన పాత్రను భుజాల మీద మోసాడు అని చెప్పవచ్చు.సినిమా మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది.
అన్ని సన్నివేశాలలో అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశాడు.ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ నిడివి తక్కువ అయినప్పటికీ కూడా అద్భుతంగా నటించింది.
సముద్ర ఖని తో పాటు తదితరులు నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
H3 Class=subheader-styleటెక్నికల్:/h3p డైరెక్టర్ ఈ సినిమాకు మంచి కథను అందించాడు.జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.
మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి. """/" /
H3 Class=subheader-styleవిశ్లేషణ: /h3pసినిమా అనేది ఒక చదువు నేపథ్యంతో ముడి కట్టింది.
చదువుని అందించాలో అన్నది బాగా చూపించారు.దేశంలో విద్య పేరుతో జరుగుతున్న అరాచకాలు డైరెక్టర్ ఈ విధంగా చూపించాడు.
ఎమోషన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి.h3 Class=subheader-styleప్లస్ పాయింట్స్: /h3pసినిమా కథ, నటీనటుల నటన, మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్, కొన్ని డైలాగ్స్.
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p అక్కడక్కడ కొంత సాగదీసినట్లు అనిపించింది.h3 Class=subheader-styleబాటమ్ లైన్: /h3pచివరిగా చెప్పాల్సిందేంటంటే.
ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందింది కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
H3 Class=subheader-styleరేటింగ్: 2.75/5/h3p.
అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…