తుస్సుమన్న పటాస్‌ను పట్టుకొస్తు్న్న లోకల్ బాయ్
TeluguStop.com
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన రీసెంట్ మూవీ ‘పటాస్’ తమిళంలో సంక్రాంతి కానుకంగా జనవరి 15న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తమిళనాట ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఇది యావరేజ్ మూవీగా అక్కడ నిలిచింది.
కాగా ఈ సినిమాను ‘లోకల్ బాయ్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు అప్పుడే ప్రకటించిన చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
ధనుష్ సరికొత్త అవతారంలో కనిపించే ఈ సినిమాను ఫిబ్రవరి 28న తెలుగులో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ సినిమాలో ధనుష్ డ్యుయెల్ రోల్‌లో నటించగా, మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది.పక్కా మాస్ అంశాలు కలగలిసిన ఈ సినిమాను దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేయగా సత్యజోతి ఫిలింస్ బ్యానర్‌పై తమిళంలో రిలీజ్ చేశారు.
ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.స్నేహ, జగపతి బాబు, నవీన్ చంద్ర లాంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాను తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత మేర మెప్పిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 28 వరకు ఆగాల్సిందే.
తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆమేనా కారణమా?