ఐశ్వర్య ప్రభావం లేదు..ఇక ధనుష్ పని అయిపోయినట్టేనా ?

ధనుష్ తమిళంలో కాస్త కూసో పాపులారిటీ ఉన్న హీరో.తన స్టార్ డం తో పాటు రజనీకాంత్ అల్లుడుగా తనకు వచ్చిన పాపులారిటీ అంతా కాదు.

కానీ ఇదంతా గతం ప్రస్తుతం ఐశ్వర్యతో విడాకులు తీసుకుని రజనీకాంత్ అల్లుడు అనే హోదా నుంచి పక్కకు తప్పుకున్నాడు ధనుష్.

ఇలాంటి తరుణంలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఐశ్వర్య గైడెన్స్ లేని ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ధనుష్ సినిమా పై కనిపించింది.

ధనుష్ తాజాగా నటించి విడుదల చేసిన సినిమా నేనే వస్తున్నా.పొన్నియన్ సెల్వన్ వంటి భారీ తారాఘనం, భారీ బడ్జెట్ ఉన్న సినిమా ముందు ఈ చిత్రం నిలవలేకపోయింది.

సరిగ్గా ఈ సినిమా విడుదలవ్వడానికి ఒక్కరోజు ముందు ధనుష్ తన సినిమాను విడుదల చేశాడు.

అసలే కథ లేదు, అలాగే తన భార్య ప్రభావము లేదు అంతకుమించిన ఆ పేలవ దర్శకత్వం వెరసి ధనుష్ కి మంచి ఫ్లాప్ టాక్ మూటకట్టుకోవాల్సి వచ్చింది.

సాధారణంగా ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే ఎంతో కొంత గ్యాప్ తీసుకుని మిగతావారు తమ సినిమాలను విడుదల చేస్తారు ఎందుకంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి.

దాని దాటికి తట్టుకుని నిలబడాలంటే అంతకు మించిన బడ్జెట్ లేదా అంతకు మించిన కథ అయినా తన సినిమాలో ఉండి తీరాలి అవేమీ లేకుండా పొన్నియన్ సెల్వన్ వంటి ఒక పెద్ద బడ్జెట్ సినిమాతో తలబడి ధనుష్ తన గొయ్యి తనే తవ్వుకున్నాడు.

ఘోరమైన సినిమా ప్రదర్శనతో ఈ చిత్రం అన్ని భాషల్లోనూ ఫ్లాప్ టాక్ వచ్చింది.

"""/"/ అసలు ఎలాంటి నమ్మకంతో ఈ సినిమాను ధనుష్ ఒప్పుకున్నాడో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి.

ఆత్మలు, వాటి ప్రతీకారాలు అనే అంశాలు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం.సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు అనేక చిత్రాలు వచ్చాయి.

వీటిని సరైన కోణంలో నడిపించే దర్శకుడు లేకపోవడమే ఈ చిత్రానికి మైనస్ పాయింట్.

రాఘవ లారెన్స్ వంటి దర్శకుడు అయితే చక్కగా హ్యాండిల్ చేయగలిగే కథను ధనుష్ తన సొంత అన్న చేతిలో పెట్టడంతో అతని దర్శకత్వం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.

ఏది ఏమైనా ధనుష్ వెనకాల నుంచి నడిపించేది ఐశ్వర్య అనే మాట అందరికీ తెలుసు ప్రస్తుతం ఐశ్వర్య ప్రభావం ఏ మాత్రం ధనుష్ పై లేదు కాబట్టి అడ్డగోలు కథలు, అడ్డగోలు నిర్ణయాలతో కెరియర్ పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది.

వైరల్ వీడియో: వామ్మో.. రక్తంతో స్నానం చేసి సముద్రంలోకి దూకిన వ్యక్తి.. మాములుగా లేదుగా..