ఉమ్మడి జిల్లా బీసీ జెఏసి ఛైర్మెన్ గా పెండెం ధనుంజయ్ నేత

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ గా మునుగోడుకు పెండెం ధనంజయ నేతను బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.

కృష్ణయ్య గురువారం హైదరబాద్ విద్యానగర్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయ భవనంలో నియమించి,నియామకపత్రం అందజేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా శుక్రవారం పెండెం ధనంజయ్ నేత మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ఆర్.

కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.బీసీ ఐక్యత కోసం ఆర్.

కృష్ణయ్య స్ఫూర్తితో కృషి చేస్తానని, యువకులను బీసీ ఉద్యమంలో పాల్గొనేలా చేసి బహుజన రాజ్యాధికారం కొరకు శక్తి వంచన లేకుండా పని చేస్తానని,ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన బీసీ ఉద్యమ నిర్మాణానికి అవసరమైన శక్తులను,వ్యక్తులను కలుపుకొని,బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా ముందుకు వెళతానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం,నాయకులు జెల్లా నరేందర్,నీల వెంకటేశం, నందగోపాల్,ఉదయ్, వనమాల రమేష్,చాపల యాదయ్య,సయ్యద్,గంజి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!