ధన త్రయోదశి రోజున బంగారం కొనడానికి అసలు కారణం ఏమిటో తెలుసా?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు.

అందుకోసమే కార్తీకమాసంలో పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కార్తీక మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు.

ఈ దన త్రయోదశి రోజు భక్తులు పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు చేసే అమ్మ వారి ఆశీస్సులు పొందుతారు.

అదేవిధంగా ధన త్రయోదశి రోజు చాలామంది ఎంతో విలువైన వస్తువులతో పాటు బంగారు నగలను కూడా కొనుగోలు చేస్తారు.

ఇలా ధన త్రయోదశి రోజు బంగారం ఎందుకు కొంటారు? ఇలా బంగారం కొనడానికి గల కారణం ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం ధన త్రయోదశి రోజు లక్ష్మిదేవి సముద్ర గర్భం నుంచి ఉద్భవించిందని చెబుతారు.

ఇలా సముద్రగర్భం నుంచి ఉద్భవించడంతో ధన త్రయోదశి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.

సాక్షాత్తు లక్ష్మీదేవి ధనానికి అధిపతి కనుక సంపదకు కారణమైన బంగారు నగలను కొనుగోలు చేయటం ఎంతో శుభకరం అని.

అందుకే ధన త్రయోదశి రోజు బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అయితే ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 2వ తేదీ వచ్చింది.

ఈరోజు హిందూ ప్రజలు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో, రాత్రంతా దీపాలు వెలిగించి పూజిస్తారు.

కనుక ధన త్రయోదశిని చిన్న దీపావళి అని కూడా జరుపుకుంటారు.

నాలుగు మందారం ఆకులతో ఇలా చేశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది తెలుసా?