ధన త్రయోదశి అంటే ఏమిటి.. ఆరోజు విశిష్టతలు ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ధనత్రయోదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది.ధన త్రయోదశి రోజు పెద్ద ఎత్తున హిందూ ప్రజలు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు.

ప్రతి సంవత్సరం కార్తీక మాసం కృష్ణ త్రయోదశి రోజున ధనత్రయోదశి రోజును జరుపుకుంటారు.

మరి ఈ ఏడాది ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది ధన త్రయోదశిని ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 2వ తేదీ వస్తుంది.

ఈ రోజున హిందూ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ధనత్రయోదశి వేడుకలు ఎంతో ఘనంగా చేసుకుంటారు.

పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు సాగరమధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి ఇదే రోజున లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామదేనువు, ధన్వంతరి ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకోసమే ఈ రోజు లక్ష్మీదేవి పుట్టిన రోజుగా భావిస్తారు.లక్ష్మీదేవి పుట్టిన దినం కావడంతో ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

"""/"/ ఇలా ధన త్రయోదశి రోజు అమ్మవారికి పూజలు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా ఉంటాయని భావిస్తారు.

ఇకపోతే ధన త్రయోదశి రోజు లక్ష్మిదేవితో పాటు కుబేరుడికి కూడా పూజలు నిర్వహిస్తారు.

ధనానికి అధిపతి కుబేరుడు కనుక ఇంతటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడికి పూజ చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుందని భావిస్తారు.

అమెరికా అధ్యక్ష పీఠం దిశగా డొనాల్డ్ ట్రంప్.. కమలకు దెబ్బేసిన స్వింగ్ స్టేట్స్