శ్రీదేవి డ్రామా కంపెనీలో ధనరాజ్.. కామెడీ స్టార్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు.

ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో ధనరాజ్ కూడా ఒకరు.మొదట సినిమాలలో కమెడియన్ గా నటించిన ధనరాజ్ ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇలా జబర్దస్త్ వల్ల వచ్చిన పాపులారిటీతో మరిన్ని సినిమా అవకాశాలు అందుకున్నాడు.ధనరాజ్ కమెడియన్ నుండి హీరో స్థాయికి ఎదిగి ఇటీవల హీరోగా ఒక సినిమాలో కూడా నటించాడు.

తాజాగా ధనరాజ్ హీరోగా నటించిన బుజ్జి ఇలా రా సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఇదిలా ఉండగా చాలా కాలంగా ఈటీవీకి దూరంగా ఉంటూ మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షోలలో సందడి చేస్తున్న ధనరాజ్ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంట్రీ ఇచ్చాడు.

ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది.

ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ బర్తడే చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో తనకి ఉన్న అనుబంధం గురించి ధనరాజ్ చెప్పుకొచ్చాడు.

"""/" / పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ధనరాజ్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశాడు.

దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ ఎపిసోడ్ లో చూపించారు.ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో ఎప్పుడైనా మాట్లాడావా అని అది ధనరాజ్ ని అడగ్గా.

ఒక్క నిమిషం అని చెప్పి ధనరాజ్ తన ఫోన్ బయటికి తీసి పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేశాడు.

హలో అనగానే ఈ ప్రోమో పూర్తవుతుంది.మొత్తానికి జబర్దస్త్ ని కాదనుకొని బయటికి వెళ్లిన ధనరాజ్ నాగబాబుతో కలసి మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో సందడి చేస్తూ మల్లెమాల వారి మీద జబర్దస్త్ మీద స్కిట్ చేసేవాడు.

ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లో ధనరాజ్ ఎంట్రీ ఇవ్వడంతో తను నటించిన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఈ షోకి వచ్చాడా? లేక కామెడీ స్టార్స్ షో కి గుడ్ బై చెప్పి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాడా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

50 డేస్ సెంటర్ల విషయంలో పుష్ప ది రూల్ గ్రేట్ రికార్డ్.. అన్ని స్క్రీన్స్ లో రన్ అవుతోందా?