తండ్రి వెల్డింగ్ షాప్ లో ఉద్యోగి.. కూతురు టెట్ టాపర్.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా టెట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.ఈ ఫలితాలలో ఎక్కువ సంఖ్యలో పేదింటి బిడ్డలు ప్రతిభ చాటుకుని తమ సక్సెస్ తో ప్రశంసలు అందుకున్నారు.

త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్(Mega DSC Notification Release) కానుండగా కచ్చితంగా మంచి మార్కులు సాధిస్తామని కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన దాసరి ధనలక్ష్మి ఏపీ టెట్(Dasari Dhanalakshmi AP Tet) పరీక్షలో సత్తా చాటారు.

"""/" / ఎస్జీటీ కేటగిరీ(SGT Category) పోస్ట్ పరీక్షలో ఆమె సత్తా చాటి ప్రశంసలు అందుకున్నారు.

150 మార్కులకు ఆమె ఏకంగా 149.99 మార్కులు సాధించి ప్రశంసలు అందుకోవడం కొసమెరుపు.

రాష్ట్ర స్థాయిలో ఆమె రెండో ర్యాంక్ సాధించి ఆమె వార్తల్లో నిలిచారు.తన సక్సెస్ గురించి ధనలక్ష్మి (Dhanalakshmi)మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి టీచర్ జాబ్ అంటే ఎంతో ఇష్టమని అన్నారు.

ఇంటర్, టీచర్ ట్రైనింగ్ కోర్స్ చదివితే టీచర్ కావచ్చని ఆ కోర్సులు పూర్తి చేశానని ధనలక్ష్మి చెప్పుకొచ్చారు.

"""/" / జూన్ నెలలో జరిగిన టెట్ పరీక్షలో(Tet Test) సైతం మంచి మార్కులు వచ్చాయని ఆమె తెలిపారు.

పట్టణంలో ఉన్న వీటీ అగ్రహారం మా నివాసం అని ధనలక్ష్మి పేర్కొన్నారు.నాన్న వెల్డింగ్ షాప్ లో చిరుద్యోగిగా (Father Is An Employee In A Welding Shop)పని చేస్తున్నారని ధనలక్ష్మి అన్నారు.

అమ్మ ఈశ్వరమ్మ(Iswaramma) గృహిణిగా పని చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.టీచర్ పోస్ట్ ను కచ్చితంగా సాధిస్తానని ఆమె చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ధనలక్ష్మి సక్సెస్ స్టోరీని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎదుగుతున్న ధనలక్ష్మి కచ్చితంగా టీచర్ అవుతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ధనలక్ష్మీ కెరీర్ పరంగా అంచలంచెలుగా ఎదిగి ఎంతో మందికి స్పూర్తిగా నిలవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆమెను ఎంతగానో ప్రోత్సహించిన తల్లీదండ్రులను సైతం నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారా ? అందుకే అలా అన్నారా ?