క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి.

సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం ఫోటోలను అభిమానులు కంపేర్ చేస్తూ ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక చిన్నారి ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ ఫోటోలో ఉన్న ఆ చిన్నారి చిన్న జడ వేసుకుని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చూడగానే ముద్దుస్తోంది.

"""/"/ అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.

ఒక్క సినిమాతో ఊహించని విధంగా స్టార్ స్టేటస్ ను అందుకోవడంతో పాటు టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

ఇటీవల టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సరసన నటించి మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇంకా అర్థం కావడం లేదా ఈ చిన్నారి మరెవరో కాదు పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రీలీల ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే వరుసగా అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది.

"""/"/ ఇకపోతే ఇటీవల శ్రీలీల రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇకపోతే ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు, హీరో రామ్ పోతినేని సరసన నటిస్తోంది.

అలా మొత్తంగా తెలుగులో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.ఓ సినిమా విడుదల అయ్యేలోపే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ.

సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది.ఈమె అందానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే.

రారనుకున్నారు కానీ..  అసెంబ్లీ కి వచ్చేసిన కేసీఆర్