టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు..!
TeluguStop.com
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు టీడీపీలో చేరనున్నారు.
ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన రేపు కలవనున్నారు.వైసీపీలో సరైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ దాడి వీరభద్రరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన అనుచరులతో పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో లేఖను రాసి సీఎం జగన్ కు పంపారు.
ఈ క్రమంలోనే టీడీపీలోకి చేరుతున్నట్లు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు.
2014 కు ముందు వరకు టీడీపీలోనే ఉన్న దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు.
ఇన్నేళ్ల తరువాత మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు.
ఈ సింపుల్ మాస్క్ తో ఇంట్లోనే లాంగ్, సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను మీ సొంతం చేసుకోండి!