భగవంతునికి చలి స్వెటర్లు వేసిన భక్తులు.. ఎక్కడో తెలుసా..

ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఇంకా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలలో చాలా తక్కువ డిగ్రీల సెల్సియస్ లలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాలలో మరింత ఎక్కువగా చలి పెరిగిపోవడంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇంకా చెప్పాలంటే చలి తీవ్రత పెరిగిపోవడంతో చాలామంది ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

చలి నుంచి రక్షించుకునేందుకు దుప్పట్లను, శాలువాలను, స్వెటర్లను ధరించి బయటకు వస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఉదయం 12 గంటల సమయం అయినా చలికి బయటికి రావడానికి కొంతమంది ప్రజలు భయపడుతున్నారంటే చలి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే వారణాసి నగరంలో వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి.అక్కడి ప్రజలతో పాటు భగవంతుడు కూడా దుప్పట్లు ఉన్ని దుస్తులు శాలువాలతో దర్శనమిస్తున్నాడు దర్శనమిస్తున్నారు.

అంతే కాకుండా వారణాసిలో ఇలా దేవతా విగ్రహాలకు దుప్పట్లు కప్పే సాంప్రదాయం ఈ మధ్యకాలంలో వచ్చింది కాదని దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి ఉంది అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

కానీ కాశి విశ్వనాధ్, చింతమని గణేష్, భారా గణేష్, గోడియా మఠం ఆలయాల్లోని విగ్రహమూర్తులకు సంప్రదాయ దుస్తులతో ఆకర్షణీయంగా అర్చకులు అలంకరించారు.

భక్తులను రక్షించే భగవంతుడికి కూడా రక్షణగా వెచ్చని దుస్తులతో పాటు దుప్పట్లు, శాలువాలను కప్పుతున్నారని పూజారి విభూది నారాయణ శుక్లా చెబుతున్నారు.

అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేయించడం దేవాలయంలో హీటర్లు పెట్టడం వంటివి చేస్తున్నట్లు అక్కడి పూజారులు చెబుతున్నారు.

భక్తులు కూడా దేవునికి స్వెటర్లను కానుకలుగా అందిస్తున్నారని కూడా తెలుపుతున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience