సొంత ఇంటిని దేవుడికి రాసిచ్చిన భక్తురాలు!
TeluguStop.com
సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి కానుకగా ఏ పదో ,పాతికో హుండీలో వేస్తాము.
ఏదైనా కోరికలు కోరినప్పుడు అది నెరవేరిన తరువాత దేవుడికి జాతర చేయడం లేదా వెండి, బంగారు నగలను కానుకగా ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం.
ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు వారు దేవునికి కానుక సమర్పిస్తుంటారు.కానీ ఓ భక్తురాలు తమ ఇంటి ఇలవేల్పుకు ఏకంగా తన సొంత ఇంటిని రాసిచ్చిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.హైదరాబాద్ సైదాబాద్ మాదన్నపేటకు చెందిన లిఖిత, జానకిరామ్ దంపతులు తమ ఇంటి ఇలవేల్పు అయినా జీడికల్ శ్రీరామచంద్ర స్వామికి ఎవరు ఇంతవరకు ఇవ్వని కానుకలను సమర్పించింది.
తమ ఇంటి ఇలవేల్పు కానుకగా లికిత, జానకిరామ్ దంపతులు సాక్షి సంతకాలతో కూడిన బాండ్ పేపర్ ను హుండీలో వేసిన ఘటన తాజాగా బయటపడింది.
ఇందులో భాగంగానే సోమవారం ఉదయం ఆలయ అధికారులు హుండీని లెక్కిస్తున్న సమయంలో స్వామివారికి కానుకగా సమర్పించిన ఈ బాండు పేపర్లు బయటపడ్డాయి.
హుండీలో దేవుడికి కానుకగా ఇంటిని వేసిన బాండ్ పేపర్ ఆలయ ఈవో శేషుభారతి గుర్తించి ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేవాదాయ అధికారులు బాండ్ పేపర్ ఆధారంగా సంబంధిత భక్తురాలు నుంచి పూర్తి స్థాయి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఈ విషయంపై ఆలయ అధికారులు మాట్లాడుతూ ఈ విధంగా భక్తులు తమ ఇంటి దేవుడికి ఏకంగా ఇంటినే రాసి ఇవ్వడంతో తమ ఇంటి ఇలవేల్పు పైవారికి ఉన్న భక్తిని చాటుకున్నారని, ఆలయ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఎంతో మందిని ఆకర్షించింది.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలను పట్టించుకోని ఎన్ఆర్ఐ ఓటర్లు .. షాకిస్తోన్న ఈసీ నివేదిక