ఆయోద్య రాంలాలా ప్రాణప్రతిష్ట వీక్షించి తరించిపోయిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో భక్తులు వీక్షించడానికి సత్సంగ సదనం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ ఈడి స్క్రీన్ పై ఆయోద్య లో రాం లాలా ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ పై సోమవారం వీక్షించి భక్తులు తరించి పోయారు.

స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు.మండలం కేంద్రం తో పాటు వివిధ మండలాలు వివిధ గ్రామాలకు చెందిన సుమారు 2000 మంది కి పైగా భక్తులు సత్సంగ సధనానికి తరలివచ్చారు.

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సత్సంగ సదన అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలనుండి 10 గంటల వరకు శ్రీరామ జయరామ జయ జయరామ భక్తులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం శ్రీమద్భాగవతసప్తాహాన్ని ఉదయం 10-00 గంటలకు శ్రీ మాన్ నమిలికొండ రమణాచార్యులు బోధించారు.

అనంతరం సనుగుల ఈశ్వర్ , పోతు ఆంజనేయులు , సత్సంగ సదనం భక్తబృందాలు భజన కార్యక్రమాన్ని ఏంతో వైభవంగా నిర్వహించారు.

అయోధ్యలో రామలీల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని టీవీలు ద్వారా వీక్షించిన అనంతరం సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి అయోధ్య అక్షింతలను ప్రతి ఒక్కరిపై చల్లి ఆశీర్వాదం అందజేశారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో అయోధ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి జైశ్రీరామ్ నినాదాలతో కూడిన వాల్ రైటింగ్ జైశ్రీరామ్ కాసయపు జెండాల పంపిణీ జరిగింది.

కాసయపు జెండాలను అన్ని గ్రామాలలో ప్రజలు తమ తమ ఇళ్లపై కాసయపు జెండాలను ఎగురవేసి రామ లీల ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సోమవారం మహిళలు తమ వాకిళ్లలో ముగ్గులు వేసి చూడముచ్చటగా రంగులు అద్దారు.

మామిడి తోరణాలు కట్టుకున్నారు వైద్యులు రామలీల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రజలు పెద్దల చేత అయోధ్య అక్షింతలను చల్లుకుని స్వామివారి ఆశీర్వాదని స్వీకరించారు , ఆయా గ్రామాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి, ఈ సందర్భంగా భక్తుల కొరకు పులిహోర సిరా ప్రసాదము అన్న ప్రసాద కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారు.

వెంకటాపురం ఓమౌజయాః ఆశ్రమం నిర్వాహకులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజలకు లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేశారు.

ఆయా గ్రామాల్లో ప్రజలు మహిళలు సోమవారం రాత్రి తమతమ ఇళ్ళ ఎదుట వత్తి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాలను నిర్వహించారు.

సత్సంగ సదనంలో జరిగిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సత్సంగ సదనం ప్రతినిధులు రామ్ రెడ్డి , గుండం రాజి రెడ్డి సంజీవరెడ్డి , అనంతరెడ్డి , లక్ష్మమ్మ మహాదేవ్ ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణాహారి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, శ్రీ లక్ష్మి కేశవ పెరుమళ్ళ ఆలయ కమిటీ అధ్యక్షులు పారిపల్లి రామిరెడ్డి , బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి , యమగొండా కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య , సద్ది లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రెప్పపాటులో 20లక్షలు హుష్‌ కాకి.. వీడియో వైరల్